News July 7, 2024

కరీంనగర్: డ్రమ్ సీడర్‌తో ఒకేరోజు 8 ఎకరాలు వరినాటు

image

ఆధునికసాగుతో కరీంనగర్ మండలం ఇరుకుల్లకు చెందిన చిగుర్లు ఆశాలు ఒకేరోజు 8 ఎకరాల్లో వరినాటు వేశాడు. ఆశాలు డ్రమ్ సీడర్ తో 8ఎకరాలు సాగుచేయడం వల్ల సమయంతో పాటు, కూలీల ఖర్చులు ఆదా అయ్యిందని తెలిపారు. 8ఎకరాలకు తనకు రూ.2400 మాత్రమే ఖర్చయినట్లు తెలిపాడు.

Similar News

News November 28, 2024

హుస్నాబాద్ నూతన పురపాలక సంఘానికి బొప్పారాజు పేరు: మంత్రి పొన్నం

image

హుస్నాబాద్‌లో నూతన పురపాలక సంఘ భవనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం ప్రారంభించారు. అనంతరం మంత్రి పొన్నం, సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి కలిసి మున్సిపల్ ఛైర్మన్ ఆకుల రజిత, కమిషనర్ మల్లికార్జున్‌లను చైర్‌లో కూర్చోబెట్టారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ అనిత, కౌన్సిలర్లు, సిద్దిపేట గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ లింగమూర్తి, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ తిరుపతి రెడ్డి తదితరులున్నారు.

News November 28, 2024

కేంద్ర మంత్రి కలిసిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ

image

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గురువారం ఢిల్లీలోని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కలిశారు. ఈ సందర్భంగా రామగుండం ప్రాంతంలో ఎయిర్ పోర్ట్ ద్వారా ఎంతో అభివృద్ధి చెందుతుందని కొత్తగా ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉందని ఇదివరకే ఎన్ టి పి సి, బసంత్,నగర్ సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయని తద్వారా ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేశారు.

News November 28, 2024

కరీంనగర్: ఫుడ్ పాయిజన్ ఘటనలను నిరసిస్తూ ABVP నిరసన

image

రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలను నిరసిస్తూ ఏబీవీపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘం నాయకులు కరీంనగర్ తెలంగాణ చౌక్ వద్ద ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పట్ల చిన్న చూపు చూస్తోందని ఆరోపించారు. నాసిరకం భోజనం పెడుతూ విద్యార్థుల ఆరోగ్యాలతో ఆటలాడుతోందని మండిపడ్డారు. సంబంధిత అధికారులు చొరవ చేసుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.