News October 10, 2024

కరీంనగర్: తమ్ముడిని చంపిన అన్న

image

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దెనపల్లిలో మంగళవారం అర్ధరాత్రి తమ్ముడిని అన్న చంపిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ప్రేమలత-రాజయ్యకు కుమారులు కుమారస్వామి, చంద్రయ్య. వీరు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. కాగా, వీరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో చంద్రయ్య మద్యం తాగి అన్నతో గొడవకు దిగాడు. ఆవేశంతో కుమారస్వామి ఇనుపరాడ్‌తో దాడి చేయగా చంద్రయ్య చనిపోయాడు.

Similar News

News November 13, 2025

కరీంనగర్‌లో ఈనెల 18న JOB MELA

image

జిల్లాలోని నిరుద్యోగులకు ఓ ప్రముఖ జ్యూవెలర్స్‌లో ఈనెల 18న జాబ్ మేళా నిర్వహిస్తునట్లు జిల్లా ఉపాధి అధికారి వై.తిరుపతి రావు తెలిపారు. 60 పోస్టులు ఉన్నాయని, డిగ్రీ పూర్తి చేసి, వయస్సు19- 30 సంవత్సరాలలోపు ఉన్నవారు అర్హులన్నారు. వేతనం రూ.20,000 నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. ఆసక్తి గలవారు నవంబర్ 18న వచ్చి పేరు నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు పైనంబర్లను సంప్రదించవచ్చు.

News November 13, 2025

రాష్ట్ర స్థాయి పోటీల్లో ఛాంపియన్‌గా కరీంనగర్

image

తెలంగాణ యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి యోగాసన పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్‌గా కరీంనగర్ జిల్లా క్రీడాకారులు నిలిచారు. ఈ సందర్భంగా వీరిని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేకంగా అభినందించారు. వీరంతా జాతీయ స్థాయి పోటీల్లోనూ రాణించాలని ఆమె ఆకాంక్షించారు.

News November 12, 2025

హుజురాబాద్: రోడ్డు యాక్సిడెంట్ వ్యక్తి మృతి

image

హుజురాబాద్ మండలం పోతిరెడ్డిపేట నుంచి హర్షిత్, త్రినేష్ ద్విచక్ర వాహనంపై హుజురాబాద్ వైపు వెళ్తుండగా సిరిసపల్లి క్రాస్ రోడ్డు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హర్షిత్, త్రినేష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హర్షిత్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.