News February 17, 2025
కరీంనగర్: తాగుడుకు బానిసై వృద్ధుడి ఆత్మహత్య

శంకరపట్నం మండలం మెట్‌పల్లిలో ముప్పిడి రామ్ రెడ్డి (72)అనే వృద్ధుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరుకు చెందిన రామ్ రెడ్డి తన మేన బామ్మర్ది తుమ్మల పురుషోత్తం రెడ్డి ఇంటివద్ద ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని కుటుంబ సభ్యులు దూరమడం వలన మనోవేదనతో తాగుడుకు బానిసై ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పురుషోత్తం రెడ్డి పేర్కొన్నాడు.
Similar News
News December 18, 2025
21 ఏళ్లకే సర్పంచ్ పదవి

TG: పంచాయతీ ఎన్నికల్లో యువత సత్తా చాటారు. సంగారెడ్డి(D) కల్హేర్(M) అలీఖాన్‌పల్లిలో BRS బలపరిచిన 21 ఏళ్ల గుగులోతు రోజా(Left) 76 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సిద్దిపేట(D) అక్కన్నపేట(M) సేవాలాల్ మహారాజ్ తండా సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన 22 ఏళ్ల జరుపుల సునీత(Right) 30 ఓట్ల తేడాతో గెలుపొందారు. చిన్న వయసులోనే సర్పంచులుగా గెలుపొందడం పట్ల గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు.
News December 18, 2025
NZB: BJP సర్పంచ్‌లు ఎంతమంది గెలిచారంటే!

నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మూడు దశల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 84 మంది సర్పంచులు BJP తరఫున గెలుపొందారు. పార్లమెంట్ పరిధిలోని నిజామాబాద్, జగిత్యాల జిల్లాల పరిధిలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 34 మండలాలు, 642 గ్రామ పంచాయతీల్లో BJP మద్దతుదారులు 299 GPల్లో పోటీ చేసి 84 గ్రామ పంచాయతీల్లో గెలిచారు. ఎంపీ అర్వింద్ తమకు అండదండలు ఇవ్వడంతో పాటు గ్రామస్థులు మద్దతు పలికారని గెలిచిన వారన్నారు.
News December 18, 2025
కడప జిల్లాలో అస్థి పన్ను డిమాండ్ ఎన్ని కోట్లంటే..

కడప జిల్లాలో 8 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరంలో అస్థి పన్ను బకాయిలు రూ.162.81 కోట్లు ఉన్నాయి. ఇందులో ఇప్పటివరకు రూ.64.78 కోట్లు (64.78%) మాత్రమే వసూలైంది. రూ. కోట్లల్లో KDP-100.80 గాను 37.65, PDTR-35.33గాను 13.17, PVLD-8.65 గాను 5.67, JMD-4 గాను 2.62, BDVL-2.73 గాను 2.11, YGL-5.01 గాను 1.87, MYDKR-5.17 గాను 1.36, KMLPRM-1.13 గాను 0.33 కోట్లు మాత్రమే వసూలైంది.


