News February 13, 2025

కరీంనగర్: దత్తత ఉత్తర్వులు అందించిన కలెక్టర్

image

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని కరీంనగర్ శిశు గృహం నుంచి పిల్లలను దత్తత తీసుకున్న దంపతులకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఈరోజు కలెక్టరేట్‌లో దత్తత ఉత్తర్వులు అందజేశారు. శిశు గృహం నుంచి ఐదుగురు మగ శిశువులను, నలుగురు ఆడ శిశువులను వరంగల్, సిద్దిపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, నల్గొండ జిల్లాలకు చెందిన పిల్లలు లేని దంపతులు దత్తత తీసుకున్నారు.

Similar News

News February 13, 2025

ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ పోటీలకు జిల్లా క్రీడాకారులు

image

ఈనెల 15 నుంచి 28వ తేదీ కాకినాడలో జరుగుతున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ పోటీలకు నర్సాపురం సచివాలయం అనిమల్ హస్బెండ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రసూల్ ఖాన్, కొంగనపాడు సచివాలయం అనిమల్ హస్బెండ్ అసిస్టెంట్ మహేశ్ ఎంపికయ్యారు. గురువారం కర్నూలు కలెక్టరేట్లోని పశుసంవర్ధక శాఖ జేడీ శ్రీనివాసులు, కల్లూరు ఏవీహెచ్ అడిషనల్ డైరెక్టర్ పార్థసారథి ప్రత్యేకంగా అభినందించారు.

News February 13, 2025

వంశీపై ముగిసిన విచారణ.. ఆస్పత్రికి తరలింపు

image

AP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కృష్ణలంక స్టేషన్లో పోలీసుల విచారణ ముగిసింది. 8గంటల పాటు అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. ప్రస్తుతం ఆయన్ను పీఎస్ నుంచి ప్రభుత్వాసుపత్రికి(జీజీహెచ్‌)కు వైద్య పరీక్షల నిమిత్తం తరలిస్తున్నారు. అనంతరం మేజిస్ట్రేటు వద్ద హాజరుపరచనున్నట్లు తెలుస్తోంది.

News February 13, 2025

ప్రియుడి నుంచి వేధింపులు ఎదుర్కొన్నా: ఐశ్వర్యా రాజేశ్

image

చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో తల్లికి అండగా ఉండేందుకు పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేసినట్లు హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్ చెప్పారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలి రోజుల్లో ఓ వ్యక్తిని ఇష్టపడినట్లు తెలిపారు. తర్వాత అతడి నుంచి వేధింపులను ఎదుర్కొన్నానని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. లవ్ కంటే అది బ్రేకప్ అయినప్పుడు వచ్చే బాధ అంటే తనకెంతో భయమన్నారు. గత అనుభవాల వల్ల ప్రేమలో పడాలంటే ఆలోచిస్తున్నానని పేర్కొన్నారు.

error: Content is protected !!