News March 30, 2025

కరీంనగర్: దరఖాస్తుకు రేపే చివరి తేదీ

image

మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ గురుకులాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి 6, 7, 8, 9వ తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం.. ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఆర్సీవో అంజలి కుమారి తెలిపారు. ఆన్‌లైన్లో దరఖాస్తులు సమర్పించడానికి ఈ నెల 31 వరకు అవకాశం ఉందన్నారు. ఏప్రిల్ 20న పరీక్ష జరుగుతుందని, అందులో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు రిజర్వేషన్, నిబంధనల ప్రకారం సీట్లు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News April 1, 2025

ఇల్లందకుంట రామాలయం బ్రహ్మోత్సవాలు, జాతర వివరాలు

image

అపర భద్రాద్రిగా పేరొందిన ఇల్లందకుంట శ్రీ సీతారాముల బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్ 16 వరకు జరుగుతాయని ఈవో సుధాకర్ తెలిపారు. ఏప్రిల్ 6న మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణం, ఏప్రిల్ 7న పట్టాభిషేకం,12న సూర్య రథోత్సవం( బండ్లు తిరుగుట)13, 14న చంద్ర రథోత్సవం(పెద్దరథం),15న శ్రీ పుష్పయాగం, 16న ఏకాంత సేవలు స్వామివారికి జరుపుతామన్నారు. భక్తులకు వైద్య, విద్యుత్, నీటి ఏర్పాట్లు చేశారు.

News March 31, 2025

KNR: డిప్యూటీ కలెక్టర్‌కు ఎంపికైన హరిణి

image

కరీంనగర్‌లోని విద్యానగర్‌కు చెందిన కన్నం హరిణి గ్రూప్-1లో 499.5మార్కులతో స్టేట్ 55వ ర్యాంక్ సాధించి, డిప్యూటీ కలెక్టర్‌కు సెలెక్ట్ అయ్యారు. హరిణి తల్లిదండ్రులు రమేష్, కళా ప్రపూర్ణ జ్యోతి ప్రభుత్వ టీచర్లు. విద్యానగర్‌లోనే ప్రాథమిక విద్యాను అభ్యసించిన హరిణి ఇంజనీరింగ్ పూర్తిచేసి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేశారు. అనంతరం ఎలాంటి కోచింగ్ లేకుండా సొంతంగా గ్రూప్స్ ప్రిపేర్ అయ్యారు.

News March 31, 2025

KNR జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు…

image

KNR జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా ఇందుర్తి 40.6°C నమోదు కాగా, బురుగుపల్లి 40.5, జమ్మికుంట 40.3, వీణవంక 40.2, కొత్తపల్లి-ధర్మారం 40.1, ఖాసీంపేట 39.9, వెంకేపల్లి 39.7, బోర్నపల్లి 39.5, కొత్తగట్టు, దుర్శేడ్ 39.4, చింతకుంట, గంగాధర 39.3, ఆసిఫ్ నగర్, తాంగుల 39.0, రేణికుంట, కరీంనగర్ 38.8, ఈదులగట్టేపల్లి, మల్యాల 38.7, గుండి, నుస్తులాపూర్ 38.4°C గా నమోదైంది.

error: Content is protected !!