News June 28, 2024

కరీంనగర్: నర్సింహులపల్లిలో అరుదైన విగ్రహం!

image

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నర్సింహులపల్లిలో నాలుగో శతాబ్దం నాటి సున్నపు రాతితో చేసిన 3 అంగుళాల ఎత్తున్న అరుదైన వరాహమూర్తి శిల్పాన్ని గుర్తించినట్లు తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. ఉత్తరాభిముఖుడైన ఈ మూర్తి అపురూపమైనదని శిల్పాన్ని పరిశీలించిన స్థపతి చరిత్రకారులు డా.ఈమని శివనాగిరెడ్డి చెప్పారు. గతంలో ఇదే గ్రామంలో పురాతన రాతి పరికరాలు లభించినట్లు వారు గుర్తు చేశారు.

Similar News

News July 1, 2024

జగిత్యాల: నేటి నుంచి నూతన చట్టాలు అమలు

image

నేటి నుంచి నూతన చట్టాలు అమలులోకి వస్తాయని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నూతన న్యాయ, నేర చట్టాల ద్వారా కేసుల దర్యాప్తులో వేగం, బాధితులకు సత్వర న్యాయం లభిస్తాయన్నారు. దేశ అంతర్గత భద్రతలో కొత్త చట్టాలు నూతన శకాన్ని ప్రారంభించనున్నాయని ఎస్పీ పేర్కొన్నారు. పోలీసుశాఖకు చెందిన డిఎస్పీ నుంచి కానిస్టేబుల్ అధికారులకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.

News July 1, 2024

KNR స్మార్ట్‌సిటీ పనుల పూర్తికి అవకాశం

image

స్మార్ట్‌సిటీ మిషన్ పనుల గడువును వచ్చే మార్చివరకు పొడిగించడంతో KNRలోని పెండింగ్‌ పనుల పూర్తికి అవకాశముంది. KNR స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ పరిధిలో రూ.647.32కోట్లతో చేపట్టిన 22 ప్రాజెక్టుల పనులు పూర్తి కాగా.. మరో 23 ప్రాజెక్టులకు రూ.259.79 కోట్లను కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కేటాయించింది. దీంతో రహదారులు, మురుగుకాలువలు, ట్రాఫిక్ సిగ్నల్స్, కమాండ్ కంట్రోల్ తదితర పనులు అందుబాటులోకి వచ్చాయి.

News July 1, 2024

నేటి నుంచి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పోరాటం

image

సింగరేణిని కాపాడుకునేందుకు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పోరాటానికి సిద్ధమైంది. సోమవారం నుంచి సింగరేణి వ్యాప్తంగా దశలవారీగా ఆందోళన కార్య క్రమాలు నిర్వహిస్తున్నట్లు టీబీజీకేఎస్ అధ్యక్షుడు రాజిరెడ్డి స్పష్టం చేశారు. 1న గనులపై నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయడంతో పాటు గని అధికారులకు వినతిపత్రాలు అందజేస్తామని తెలిపారు.