News December 16, 2025
కరీంనగర్: నిరుద్యోగులకు అవకాశం.. 19న జాబ్ మేళా

కరీంనగర్ జిల్లాలోని నిరుద్యోగుల కోసం ఈ నెల 19న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి అధికారి తిరుపతి రావు తెలిపారు. ఆటోమోటివ్స్ KNR సంస్థలోని 20 పోస్టులకు గాను, ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన 20-40 ఏళ్ల పురుషులు అర్హులు. వేతనం రూ.14,000 నుంచి ప్రారంభమవుతుందని, ఆసక్తి గలవారు పేరు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. వివరాలకు 72076 59969 నంబర్లను సంప్రదించవచ్చు.
Similar News
News December 18, 2025
KNR: ఎన్నికల పరిశీలకులకు అభినందనలు: కలెక్టర్

గ్రామపంచాయతీ ఎన్నికలను సమర్ధవంతంగా, పారదర్శకంగా నిర్వహించినందుకు ఎన్నికల పరిశీలకులు వి. వెంకటేశ్వర్లును జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అభినందించారు. ఎన్నికల విధుల్లో క్రమశిక్షణ, నిబద్ధతతో పని చేసిన తీరు ప్రశంసనీయం అన్నారు. ఎన్నికల నిర్వహణలో సమన్వయంతో పనిచేసిన ప్రతి ఒక్కరి కృషి ఫలితమే విజయవంతమైన ఎన్నికల నిర్వహణ అని కలెక్టర్ పేర్కొన్నారు. ఆయన వెంట జిల్లా పంచాయతీ అధికారి ఉన్నారు.
News December 18, 2025
ఒక్క ఓటుతో శ్రీరాములపల్లి సర్పంచ్‌గా రమ్య

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి గా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గుత్తికొండ రమ్య ఒక్క ఓటుతో విజయం సాధించారు. తన ప్రత్యర్థి BRS అభ్యర్థి తిప్పరబోయిన శారదపై ఒక్క ఓటు మెజార్టీతో గెలుపొందారు. రీకౌంటింగ్ జరిగినా ఒక ఓటు తేడా ఉండడంతో గెలిచినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. అభిమానులు సంబరాలు జరుపుకున్నారు.
News December 17, 2025
కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ పమేలా సత్పతి

ముడో విడత గ్రామ పంచాయతీల ఎన్నికలు పూర్తయిన తరువాత కౌటింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. జమ్మికుంట మండలం మాచనపల్లి, జగ్గయ్య పల్లె గ్రామంలో కౌటింగ్ ప్రక్రియను పరిశీలించినారు. అనంతరం వీణవంక మండలం రెడ్డిపల్లి, చల్లూర్, మామిడాలపల్లెలోనూ కౌటింగ్ విధానంను పర్యవేక్షించి ఈ మేరకు అధికార్లకు పలు సూచనలు చేశారు.


