News August 14, 2025

కరీంనగర్‌: నేటితో PACSల కాల పరిమితి ఖతం!

image

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలక వర్గాల గడువు నేటితో ముగియనుంది. ఉమ్మడి కరీంనగర్‌లోని 131 PACSలకు 2020 ఫిబ్రవరి 13న ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత సహకార సొసైటీల పాలకవర్గాల సభ్యులను ఎన్నుకున్నారు. వారి 5 ఏళ్ల గడువు ఈ ఏడాది ఫిబ్రవరి 13న ముగియగా.. ప్రభుత్వం 6 నెలల పదవీకాలం పొడిగించింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం PACS 123 ఉండగా కరీంనగర్లో 30, జగిత్యాల 51, సిరిసిల్ల 22, పెద్దపల్లిలో 20 ఉన్నాయి.

Similar News

News August 16, 2025

భద్రాద్రి: పురుగు మందు తాగి యువతి SUICIDE

image

పురుగు మందు తాగి యువతి మృతి చెందిన ఘటన గుండాల మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుండాల మండలం చీమలగూడెం గ్రామానికి చెందిన గౌతమి(18) పురుగుల మందు తాగగా గమనించిన స్థానికులు హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందింది. గుండాల ఎస్ఐ సైదారావు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఇల్లందుకు తరలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News August 16, 2025

తల్లీకొడుకుల అక్రమ సరోగసీ దందా.. అరెస్ట్

image

TG: అపార్టుమెంట్లో అక్రమంగా సరోగసీ దందా చేస్తున్న తల్లీకొడుకులు లక్ష్మీరెడ్డి(45), నరేందర్‌రెడ్డి(23)ని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు వివిధ రాష్ట్రాల నుంచి మహిళల్ని తీసుకొచ్చి తమ ఇంట్లోనే ఉంచుకుంటున్నారు. IVF ద్వారా గర్భం దాల్చేలా చేసి, పిల్లలు పుట్టిన తర్వాత ఎంతో కొంత డబ్బు ఇచ్చి పంపేస్తారు. పిల్లలు లేని ధనవంతుల కుటుంబాలే టార్గెట్‌గా ఒక్కో సరోగసీకి రూ.10-20 లక్షలు వసూలు చేస్తున్నారు.

News August 16, 2025

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 2,638 టన్నుల యూరియా

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 2,638.44 టన్నుల యూరియా గూడ్స్ వ్యాగన్ల ద్వారా చేరుకుంది. చింతకాని మండలం పందిళ్లపల్లిలోని రేక్ పాయింట్ వద్దకు వచ్చిన యూరియాను ఖమ్మం జిల్లాకు 1,538.44 టన్నులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 1,000 టన్నులు, సీఆర్పీ ఖమ్మంకు 100 టన్నులు చొప్పున బదిలీ చేసినట్లు రేక్ పాయింట్ టెక్నికల్ అధికారి పవన్‌కుమార్ తెలిపారు. ఈ యూరియాను రైతులకు త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు.