News March 5, 2025

కరీంనగర్: నేడే పరీక్షలు.. ALL THE BEST

image

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 35,562 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారు. ఫస్టియర్ 17.799, సెకండియర్‌లో 17763 మంది విద్యార్థులు రాయనుండగా.. 58 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇంటర్ పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో BNS 163(144) సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. ఒక నిమిషం ఆలస్యాన్ని తాజాగా 5 నిమిషాలకు సడలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ALL THE BEST

Similar News

News September 12, 2025

కరీంనగర్‌లో ఈనెల 17న జాబ్ మేళా

image

నిరుద్యోగులకు కరీంనగర్ కళ్యాణి జ్యువెలర్స్‌లో జాబ్స్ కోసం ఈనెల 17న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి తిరుపతిరావు తెలిపారు. 60 పోస్టులు ఉన్నాయని, డిగ్రీ పూర్తి చేసి, వయసు 19 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలన్నారు. వేతనం రూ.20,000 అని, ఆసక్తి గల వారు ఈనెల 17న KNR ఉపాధి కార్యాలయంలో ఇంటర్వ్యూకు హాజరవ్వాలని, వివరాలకు 9052259333, 9944922677, 7207659969, 9908230384 నంబర్లను సంప్రదించాలని కోరారు.

News September 12, 2025

కరీంనగర్: సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్‌హెచ్‌ఓగా రమేశ్

image

కరీంనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్‌హెచ్‌ఓగా డీఎస్పీ కోత్వాల్ రమేశ్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఎస్‌హెచ్ఓగా పనిచేసిన డీఎస్పీ నరసింహారెడ్డి హైదరాబాద్ సీసీఎస్‌కి బదిలీ కాగా ఆదిలాబాద్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్‌లో డీఎస్పీగా పనిచేసిన రమేశ్ కరీంనగర్‌కు బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం రమేశ్ సీపీ గౌస్ ఆలంను మర్యాద పూర్వకంగా కలిశారు.

News September 11, 2025

కరీంనగర్: నిరుపయోగంగా నూతన అంబేడ్కర్ భవనం

image

కరీంనగర్ పరిధి చింతకుంటలో నిర్మించిన నూతన అంబేడ్కర్ భవనం ప్రారంభమై, సంవత్సరాలు గడిచినా, ఇప్పటికీ ఉపయోగంలోకి రాకపోవడంతో జిల్లా ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రూ.8 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ భవనాన్ని మాజీ మంత్రి గంగుల కమలాకర్ 2023 అక్టోబర్‌లో ప్రారంభించారు. అయితే ప్రారంభోత్సవం తర్వాత ఎవరూ పట్టించుకోకపోవడంతో పూర్తిగా నిరుపయోగంగా మారింది. తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.