News October 16, 2024

కరీంనగర్: పంచాయతీ ఎన్నికల బరిలో యువత!

image

ఇప్పటి వరకు రాజకీయాలంటే ఆసక్తి చూపని యువత ధోరణిలో మార్పు కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని 1,226 పంచాయతీల్లో ప్రధానంగా యువత బరిలో ఉండేందుకు ఆసక్తి చూపుతోంది. రోజూ గ్రామంలో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తూ.. ప్రజల్లో గుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు గ్రామంలోని ముఖ్య నాయకులను కలుస్తూ వారి ఆశీస్సులు తీసుకునేలా కసరత్తు చేస్తున్నారు. మరి మీ దగ్గర యువత బరిలో ఉంటుందా? కామెంట్.

Similar News

News December 26, 2025

ఈనెల 31 నుంచి యాసంగి పంటకు సాగునీటి విడుదల

image

LMD నుంచి కాకతీయ కాలువల ద్వారా ఈనెల 31న ఉ.11 గంటలకు రైతులకు యాసంగి పంటకు సాగునీటిని విడుదల చేయనున్నట్లు ఇరిగేషన్ సూపరింటెండింగ్ ఇంజినీర్ రమేశ్ తెలిపారు. నీటి పారుదల శాఖ కమిటీ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు వారబందీ పద్ధతిలో జోన్ 1కు 7 రోజులు, జోన్ 2కు 8 రోజులు సాగునీటి విడుదల చేయనున్నట్లు తెలిపారు. సాగునీటిని వృథా కాకుండా పొదుపుగా వాడుకొని సహకరించాలని రైతులను కోరారు.

News December 24, 2025

కరీంనగర్: పత్తి రైతులకు విజ్ఞప్తి

image

జిల్లా పత్తి రైతులకు సీసీఐ వారు కాపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుకింగ్ చేసి పత్తిని అమ్ముకొనే క్వింటాళ్ల నిబంధనలో మార్పు చేసినట్లు జిల్లా మార్కెటింగ్ అధికారి తెలిపారు. ఈ నెల 25 అర్థరాత్రి నుంచి స్లాట్ బుకింగ్ చేసుకొన్న రైతులు గరిష్టంగా అదనంగా 5 క్వింటాళ్ళ పత్తిని విక్రయించడానికి అనుమతి ఇవ్వడమైనది. రైతులు పత్తి పరిమాణాన్ని నమోదు చేసుకొని పత్తి కొనుగోళ్ళకు సహకరించాలని కోరారు.

News December 24, 2025

సీపీఐ శతవసంతాల ముగింపు సభను విజయవంతం చేయండి: చాడ

image

భారత కమ్యూనిస్టు పార్టీ శతవసంతాల ఉత్సవాలలో బాగంగా జనవరి 18న ఖమ్మం పట్టణంలో నిర్వహించే ముగింపు సభను విజయవంతం చేయాలని వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. కరీంనగర్‌లోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో బుధవారం విలేకర్లతో మాట్లాడారు. గడిచిన వందేళ్లలో పేదల పక్షాన నిలబడి ఎన్నో ప్రజా పోరాటాలు నిర్వహించిన కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుందన్నారు.