News March 4, 2025
కరీంనగర్: పట్టభద్రుల ఎన్నిక కౌంటింగ్ అప్డేట్

కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎన్నికలో ఇప్పటివరకు 2 లక్షల 10 వేల ఓట్లను లెక్కించినట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో సుమారు 21 వేల ఓట్లు చెల్లుబాటు కాలేదన్నారు. సుమారు ఒక లక్ష 89 వేల ఓట్లు చెల్లుబాటు అయ్యాయని ఇంకా 40 వేల ఓట్లు ప్రాథమిక లెక్కింపు విభజన చేయాల్సి ఉందన్నారు. మంగళవారంఉదయం 10 గంటల నుంచి ప్రాధాన్యత ఓట్లను కౌంటింగ్ చేయనున్నట్లు తెలిపారు.
Similar News
News February 16, 2026
తిరుపతి కలెక్టరేట్‌కు 443 అర్జీలు.!

తిరుపతి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం 443 అర్జీలు అందినట్లు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. అర్జీదారుల సమస్యలను సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అర్జీదారులకు తాగునీరు, మెడికల్ క్యాంప్, టీ వంటి సౌకర్యాలు కల్పించి వారి వినతులను స్వీకరించామన్నారు. శాఖలవారీగా రెవెన్యూ విభాగంలో అత్యధికంగా 280 అర్జీలు వచ్చాయన్నారు.
News February 16, 2026
MBNR: U-17 క్రికెట్ టోర్నీ విజేతగా మహబూబ్‌నగర్

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మినీ స్టేడియంలో 69వ ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి అండర్-17 క్రికెట్ బాలుర టోర్నమెంట్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల నుంచి పది జట్లు పాల్గొనగా.. మొదటి స్థానంలో మహబూబ్‌నగర్, రెండో స్థానంలో ఖమ్మం, రంగారెడ్డి జిల్లా మూడో స్థానంలో నిలిచాయి. గెలిచిన జట్లకు బహుమతులు ప్రదానం చేశారు. ఎంఈఓ మంజులాదేవి, SGF సెక్రటరీ ఆర్.శారదాబాయి, స్థానిక నేతలు, పీడీలు పాల్గొన్నారు.
News February 16, 2026
సమష్టి కృషితో జిల్లా ప్రగతి: నల్గొండ కలెక్టర్

నల్గొండ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజావాణి’లో ఆయన పాల్గొని బాధితుల నుంచి 82 వినతులను స్వీకరించారు. కోర్టు కేసులు, కమిషన్లలో పెండింగ్‌లో ఉన్న అంశాలపై వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని సూచించారు. మార్చి నెలాఖరులోగా నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.


