News March 6, 2025
కరీంనగర్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఎవరికి ఎన్ని ఓట్లంటే..?

ఉమ్మడి కరీంనగర్, మెదక్, అదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండో ప్రాధాన్యత ఓట్లతో బీజేపీ నుంచి పోటీ చేసిన అంజిరెడ్డి 98,637 ఓట్లతో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన నరేందర్ రెడ్డికి 93,531 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ నుంచి పోటీ చేసిన ప్రసన్న హరికృష్ణకు 63,972 ఓట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News November 6, 2025
గోదావరిఖని: ‘అబ్సెంటిజం సర్క్యూలర్‌పై ఆందోళనలో కార్మిక వర్గం’

సింగరేణి యాజమాన్యం అబ్సెంటిజంపై జారీ చేసిన సర్క్యూలర్‌తో కార్మిక వర్గం ఆందోళనకు గురవుతుందని TBGKS అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అబ్సెంటిజం సర్క్యూలర్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని, మెడికల్ బోర్డు నిర్వహణ త్వరలో చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి పోరాటం చేయడం తప్పదని హెచ్చరించారు.
News November 6, 2025
ప్రభుత్వ స్కూళ్లలో 2,837 ఉద్యోగాలు!

తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లలో 2,837 కంప్యూటర్ టీచర్లను (ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్లు) నియమించనున్నారు. విద్యార్థులకు ఐటీలో శిక్షణ ఇవ్వడానికి ఔట్ సోర్సింగ్ విధానంలో టీచర్లను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా ఈ నియామక ప్రక్రియ చేపట్టనున్నారు. నెలకు గౌరవ వేతనంగా రూ.15వేలు చెల్లించనున్నారు. త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.
News November 6, 2025
జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి: డీఎంహెచ్‌వో

జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలులో మహబూబాబాద్ జిల్లాను అగ్రభాగాన నిలపాలని డీఎంహెచ్‌వో డాక్టర్ బి. రవి రాథోడ్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో ఆయన అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. మాతా శిశు సంరక్షణ, క్షయ వ్యాధి నియంత్రణ వంటి కీలక అంశాలపై వైద్యాధికారులు, నర్సింగ్ ఆఫీసర్లు, సూపర్‌వైజర్ సిబ్బందితో డీఎంహెచ్‌వో సమీక్షించారు.


