News July 20, 2024

కరీంనగర్: పదవుల్లో జిల్లా నేతలు.. అభివృద్ధిపై గంపెడాశలు!

image

కరీంనగర్ జిల్లా అభివృద్ధిపై ఆశలు చిగురిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో జిల్లా నేతలు కీలక పదవుల్లో కొనసాగుతుండటంతో అభివృద్ధిపై ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. కేంద్రమంత్రిగా బండి సంజయ్, రాష్ట్ర మంత్రులుగా శ్రీధర్ బాబు, పొన్నంతో పాటు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్‌కు ప్రభుత్వ విప్ పదవులు దక్కగా జిల్లాకు కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు.

Similar News

News August 17, 2025

హుజురాబాద్: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

హుజురాబాద్ పట్టణంలోని కిందివాడకు చెందిన పోలీస్ హోంగార్డు బొడిగ తిరుపతి కుమారుడు బొడిగ సందీప్ (25) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వ్యక్తి గత అవసరాల నిమిత్తం పట్టణంలోని బతుకమ్మ సౌల్లల్లకు బైక్ పై వెళ్లిన సందీప్ అదుపుతప్పి కిందపడి ప్రమాదానికి గురై అక్కడికక్కడే మరణించాడు. ఉదయమే తన స్నేహితులు, పరిచయస్తులను కలిసిన సందీప్ ఇలా మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులు స్నేహితుల్లో తీవ్ర విషాదం నెలకొంది.

News August 16, 2025

రామకృష్ణ కాలనీలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

image

తిమ్మాపూర్ మండలం వ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. రామకృష్ణ కాలనీ గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు కృష్ణుడు, రాధ, గోపికల వేషధారణలతో అలరించారు. ఉట్టి కొడుతూ చిన్నారులు సంబరపడ్డారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పంటలు బాగా పండాలని కోరుకుంటూ కృష్ణుడికి పూజలు చేశారు. కార్యక్రమంలో యాద సంఘం నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

News August 15, 2025

తిమ్మాపూర్: కానిస్టేబుల్ నరేష్‌కు ఉత్తమ సేవా పురస్కారం

image

తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న నరేష్ ఉత్తమ సేవా పురస్కారం అందుకున్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా KNR పోలీస్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన వేడుకల్లో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న నరేష్‌ను కలెక్టర్ ప్రమేలా సత్పత్తి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అభినందించారు.