News December 22, 2025

కరీంనగర్: పల్లె పగ్గాలు చేపట్టనున్న కొత్త సారథులు..!

image

పల్లెల్లో కొత్త పాలన మొదలుకానుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికైన నూతన సర్పంచులు, వార్డు సభ్యులు సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. మూడు విడతలుగా జరిగిన పంచాయతీ సమరంలో విజేతలుగా నిలిచిన అభ్యర్థులు, నేడు అధికారికంగా పల్లె పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. దీంతో గ్రామాల్లో సందడి నెలకొంది. ఈరోజు ఉదయం 10 గంటలకు పంచాయతీ కార్యదర్శులు వీరితో ప్రమాణం చేయిస్తారు.

Similar News

News December 22, 2025

ప్రజల ఆరోగ్యంపై రాజీ వద్దు: కలెక్టర్

image

ఆహార కల్తీని అరికట్టి ప్రజలకు స్వచ్ఛమైన ఆహారం అందేలా చూడాలని బాపట్ల కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ భావనతో కలిసి ఆహార భద్రతా ప్రమాణాలపై (FSSAI) అవగాహన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఆహార పదార్థాల్లో కల్తీని గుర్తించే విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో DRO గంగాధర్ గౌడ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

News December 22, 2025

GOOGLE MAP సాయంతో లూటీ… చివరకు ఏం జరిగిందంటే?

image

టెక్నాలజీ వాడుక ఇప్పుడు ఇళ్లలో లూటీలకూ పాకింది. గూగుల్ MAP స్ట్రీట్ వ్యూ ఫీచర్ సాయంతో ధనవంతుల ఇళ్లున్న ప్రాంతాలు, వాటిలోకి ఎలా చొరబడవచ్చో గుర్తించి ఓ ముఠా జంషెడ్‌పూర్‌లోని ఓ ఇంట్లో దొంగతనం చేసింది. అయితే పోలీసులు CCTV ఫుటేజీ, మొబైల్ ట్రాకింగ్‌ను కంబైనింగ్ చేసి పట్నాలో ఉన్న ముఠాను పట్టుకున్నారు. ఈ ముఠా పక్కరాష్ట్రాలకు పారిపోయేలా రూట్‌నూ ఎంచుకొని మరీ తమ నుంచి తప్పించుకొనేదని పోలీసులు తెలిపారు.

News December 22, 2025

అమీర్‌పేట్ గురించి ఈ విషయం మీకు తెలుసా?

image

HYD అమీర్‌పేట్ అంటే కోచింగ్ సెంటర్ల అడ్డా మాత్రమే కాదు.. లక్షలాది నిరుద్యోగుల ఆశల వారధి. 1900 కాలంలో ఆరో నిజాం తన జాగీర్దార్ అమీర్ అలీకి ఈ ప్రాంతాన్ని కానుకగా ఇచ్చారు. అప్పటి వేసవి రాజభవనమే నేటి నేచర్ క్యూర్ ఆసుపత్రి. రాజసం నిండిన ఈ గడ్డపై ఎందరో విద్యార్థులు నైపుణ్యం పెంచుకుని ప్రపంచస్థాయి కంపెనీలలో స్థిరపడ్డారు. ప్రతి విద్యార్థికి అమీర్‌పేట్ ఓ భావోద్వేగం. ఎంత ఎదిగినా ఈ చోటును ఎవరూ మర్చిపోలేరు.