News December 16, 2025

కరీంనగర్: పల్లె పిలుస్తోంది.. ప్రగతి కోరుతోంది..!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా స్థానిక ఎన్నికల కోలాహలం తుది దశకు చేరుకుంది. బుధవారం ఉ. 7 గంటల నుంచి మ. ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుండగా, మ. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. గ్రామాల అభివృద్ధి జరగాలంటే విద్యావంతులైన యువత భాగస్వామ్యం అవసరం. ఉద్యోగ, ఉపాధి రీత్యా పట్టణాల్లో స్థిరపడిన యువత ఈ ఒక్కరోజు సొంతూళ్లకు వచ్చి ఓటు వేయాలని గ్రామపెద్దలు కోరుతున్నారు.

Similar News

News March 4, 2026

ఖమ్మం: తగ్గిన బొగ్గు ఉత్పత్తి.. ప్రభుత్వం సీరియస్

image

తెలంగాణ విద్యుత్ అవసరాల్లో కీలకమైన సింగరేణి సంస్థ సమస్యల్లో చిక్కుకుంది. గత ఏడాది కంటే ఈ జనవరిలో 17.70 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి తగ్గడంపై కేంద్రం వివరణ కోరింది. నాణ్యత లోపాలు, లెక్కల్లో తేడాలపై ప్రభుత్వం సీరియస్ అయింది. బాధ్యులైన అధికారులపై వేటు వేసేందుకు సిద్ధమవడంతో, సంస్థ భవిష్యత్తుపై కార్మికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జెన్ కో నుంచి వస్తున్న ఒత్తిడితో సంస్థ సతమతమవుతోంది.

News March 4, 2026

అమలాపురం: నిద్రమత్తు వదిలిస్తున్న పోలీసులు

image

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు SP రాహుల్ మీనా ఆదేశాల మేరకు బుధవారం తెల్లవారుజామున ‘స్టాప్, వాష్ అండ్ గో’ కార్యక్రమం నిర్వహించారు. నిద్రమత్తులో వాహనాలు నడపడం వల్ల జరుగుతున్న ప్రమాదాలను అరికట్టడమే లక్ష్యంగా పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. హైవేలపై వాహనాలను నిలిపి డ్రైవర్ల ముఖాలు కడిగించి, వారికి అవగాహన కల్పించారు. అర్ధరాత్రి వేళల్లో ప్రయాణించే డ్రైవర్ల అప్రమత్తత కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.

News March 4, 2026

2వేల టార్గెట్లను ధ్వంసం చేశాం: US మిలిటరీ

image

ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా ఇరాన్‌లోని 2వేల లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు US సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఆ దేశ నేవీకి చెందిన ఒక సబ్‌మెరైన్ సహా 17 యుద్ధనౌకలను ధ్వంసం చేశామని తెలిపింది. ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ ఒమన్, అరేబియన్ గల్ఫ్, హార్ముజ్ జలసంధిలో ఒక్క ఇరాన్ షిప్పు కూడా లేదని తెలిపింది. మరోవైపు నేవీతో పాటు ఇరాన్ మిస్సైల్ సామర్థ్యాన్ని కూడా పూర్తిగా దెబ్బ తీసేలా అమెరికా దాడులు చేస్తోంది.