News December 8, 2025
కరీంనగర్: పల్లె పెడదారి పడుతోంది..!

ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే పడే శిక్షలపై అభ్యర్థులకు అవగాహన లేకపోవడమే పల్లెపోరు పెడదారికి కారణమవుతోంది. ఉమ్మడి KNRలో కోల్ మైనింగ్, గ్రానైట్ ప్రాంతాల్లో ముఖ్యంగా రిజర్వేషన్ జనరల్ వచ్చిన గ్రామాల్లో అభ్యర్థులు మద్యం, వందలమందితో ప్రచారం, ఓటుకు నోటు ప్రలోభాలతో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. కాగా, శాంతి భద్రతల పరిరక్షణ, మద్యం పంపకాలపై ఎక్సైజ్ యాక్ట్‌ల అమలులో అధికారుల ఉదాసీనత స్పష్టంగా కనిపిస్తోంది.
Similar News
News December 10, 2025
గ్లోబల్ సమ్మిట్‌కు విద్యార్థులు.. PHOTO GALLERY

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో విద్యార్థులు సందడి చేశారు. నిన్నటితో సమ్మిట్ ముగియగా ఇవాళ ఫ్యూచర్ సిటీలోని వేదిక వద్దకు స్టూడెంట్స్‌కు అధికారులు ఉచిత ప్రవేశం కల్పించారు. వారంతా అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ఆసక్తిగా తిలకించారు. రోబో చేస్తున్న పనులను చూసి పారిశుద్ధ్య కార్మికులు ఆశ్చర్యపోయారు. అందుకు సంబంధించిన ఫొటోలను పైన గ్యాలరీలో చూడవచ్చు.
News December 10, 2025
వాస్తు ప్రకారం 4 మూలల్లో ఏమేం ఉండాలి?

ఇంటి మూలలు ప్రకృతి శక్తులకు అనుగుణంగా ఉండాలని వాస్తు శాస్త్రం సూచిస్తోంది. దీని ప్రకారం.. ఇంటికి ఈశాన్య మూలలో గుంట(లోతు/నీరు), ఆగ్నేయ మూలలో మంట(వంటగది), నైరుతి మూలలో మెట్టగా(ఎత్తుగా, బరువుగా), వాయువ్య మూలలో గాలి(చలనం) ఉండేలా చూసుకోవాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఇది మంచి సంబంధాలకు, చలనానికి తోడ్పడుతుందని వివరిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>
News December 10, 2025
పవన్‌కు నీతి, ధర్మం లేవు: అంబటి

AP: పరకామణి చోరీ విషయంలో జగన్ వ్యాఖ్యలను పవన్ వక్రీకరిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. అసలు పవన్ ఏ ధర్మాన్ని పాటిస్తున్నారని ప్రశ్నించారు. ‘నేను బాప్టిస్ట్ మతం తీసుకున్నానని ఒకసారి, సర్వమతాలూ సమానమని మరోసారి అన్నాడు. ఇప్పుడు సనాతనమే తన ధర్మం అంటున్నాడు. నీకో ధర్మం లేదు, నీతి లేదు, మతం లేదు, సిద్ధాంతం లేదు. నీకున్న ఒకే ఒక్క సిద్ధాంతం CBN చెప్పింది చేయడం’ అని సెటైర్లు వేశారు.


