News February 27, 2025

కరీంనగర్: పోలింగ్ స్టేషన్లను సందర్శించిన కలెక్టర్

image

కరీంనగర్ లోని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ స్టేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. డాక్టర్ స్ట్రీట్ లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో గల గ్రాడ్యుయేట్ పోలింగ్ స్టేషన్‌ను, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ స్టేషన్‌ను సందర్శించారు. పోలింగ్ సరళిపై ప్రిసైడింగ్ అధికారిని అడిగి తెలుసుకున్నారు.

Similar News

News February 19, 2026

కరీంనగర్: చెక్ డ్యామ్‌ల వద్ద ఇసుక తవ్వకాలు నిషిద్ధం

image

నదులపై ఉన్న చెక్ డ్యామ్‌ల రక్షణ దృష్ట్యా వాటికి ఎగువ, దిగువన 300 మీటర్ల మేర ఇసుక తవ్వకాలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి స్పష్టం చేశారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం‌తో కలిసి జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు జిల్లాలో ఇసుక నిర్వహణపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News February 18, 2026

వీణవంక జాతర ఘటనపై డీజీపీకి కౌశిక్ రెడ్డి ఫిర్యాదు

image

వీణవంకలో సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల పట్ల పోలీసుల ప్రవర్తనపై తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా హుజురాబాద్ ఏసీపీ మాధవి, జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీ నారాయణ, కరీంనగర్ సీపీ గౌస్ ఆలంపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై డీజీపీ స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తెలిపారు.

News February 18, 2026

KNR: తప్పనిసరిగా ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ చేసుకోవాలి: కలెక్టర్

image

కేంద్ర పథకాల లబ్ధి పొందేందుకు కరీంనగర్ జిల్లాలోని రైతులందరూ విధిగా ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ చేయించుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. జిల్లాలో 2,09,450 మంది రైతులకు గాను, ఇప్పటివరకు 1,21,814 మంది నమోదు చేసుకున్నారని తెలిపారు. మిగిలిన 87,636 మంది కోసం ఈ నెల 19 నుంచి 28 వరకు ఏఈఓలు, మీ-సేవా కేంద్రాల ద్వారా ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.