News March 23, 2026
కరీంనగర్ ప్రజావాణికి 233 అర్జీలు

ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి, క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి 233 అర్జీలను స్వీకరించారు. సమస్యలను పెండింగ్లో ఉంచకుండా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.
Similar News
News April 20, 2026
కరీంనగర్: రెండో విడత రైతు భరోసా రూ.53.5 కోట్లు

యాసంగి రెండో విడత రైతు భరోసా నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కరీంనగర్ జిల్లాలో 2,14,313 మంది రైతులకు రూ.213.45 కోట్లు జమ చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు రెండు విడతల్లో 1,94,227 మందికి రూ.143.66 కోట్లు కేటాయించినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. 2వ విడతలో రూ.53.50 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ నిధులను భూపాలపల్లి(D) కాటారం(M) నస్తురపల్లి బహిరంగ సభలో CM రేవంత్ నేడు విడుదల చేయనున్నారు.
News April 19, 2026
కరీంనగర్: ప్రశాంతంగా మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష

కరీంనగర్ జిల్లాలోని 11 తెలంగాణ ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 1,444 మంది దరఖాస్తు చేసుకోగా, 1,263 మంది పరీక్షకు హాజరయ్యారు. 181 మంది గైర్హాజరయ్యారు. కొత్తపల్లి మండలం ఎలగందుల పాఠశాలలోని పరీక్షా కేంద్రాన్ని జిల్లా విద్యాశాఖాధికారి అశ్వని తానాజీ వాకడే తనిఖీ చేశారు. విద్యార్థులకు అన్ని వసతులు కల్పించినట్లు ఆమె తెలిపారు.
News April 19, 2026
‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి మోక్షం ఎప్పుడు..?

నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకగా చేపట్టిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకం అమలులో జాప్యంపై అభ్యర్థులు ఆశతో ఉన్నారు. కరీంనగర్ జిల్లాలో రాయితీ రుణాల కోసం 55 వేలకు పైగా యువత ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. నెలలు గడుస్తున్నా యూనిట్లు మంజూరు కాకపోవడంతో నిరాశలో ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రుణాల పంపిణీ చెయ్యాలని కోరుతున్నారు.


