News August 30, 2024

కరీంనగర్: ప్రధాన జలాశయాలకు పరిమితంగా వరద నీరు!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నీరందించే ప్రధాన జలాశయాలకు ఈ వానాకాలంలో పరిమితంగానే వరద నీరు వచ్చి చేరింది. శ్రీరామసాగర్ జలాశయంలోకి 63 టీఎంసీల వరద రాగా ప్రాజెక్టు నుంచి ఎల్ఎండీ ఎగువన గల 0-146 కి.మీ పరిధిలోని ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీపాద ఎల్లంపల్లికి వస్తున్న వరదను నంది, గాయత్రి పంపుహౌజుల ద్వారా వరదకాలువలోకి ఎత్తిపోసి మధ్య మానేరు, దిగువ మానేరు జలాశయాలకు తరలిస్తున్నారు.

Similar News

News November 26, 2024

కోరుట్ల: భార్య, కూతురు సంతోషంగా ఉండాలని సూసైడ్

image

NZB జిల్లా న్యాల్కల్ మాసాని చెరువులో కూతురితో కలిసి తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. NZBకు చెందిన కాంత్రికుమార్‌కు కోరుట్లకు చెందిన మానసతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. కాగా పెద్ద కూతురు నేహశ్రీకి మానసిక ఆరోగ్యం కుదుట పడకపోవడంతో మనస్తాపం చెంది కూతురితో కలిసి చెరువులో దూకి సూసైడ్ చేసుకున్నాడు. తన భార్య, చిన్న కూతురు సంతోషంగా ఉండాలని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.

News November 26, 2024

కరీంనగర్‌లో పెరిగిన చలి.. జాగ్రత్త!❄

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చలి విపరీతంగా పెరిగింది. 4 రోజుల క్రితమే కనిష్ఠ ఉష్ణోగ్రతలు దాదాపు 4 డిగ్రీల వరకు తగ్గినట్లు HYD వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు చలి గాలులు వీస్తున్నాయి. ఇక అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు మంచు అలుముకుంటోంది. శ్వాసకోస సమస్యలు ఉన్నవారు‌ ఈ సమయాల్లో బయటకురాకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. జాగ్రత్త! SHARE IT

News November 26, 2024

భాషతో పాటు భావ వ్యక్తీకరణ ముఖ్యం: కరీంనగర్ కలెక్టర్

image

విద్యార్థులకు భాషతో పాటు భావ వ్యక్తీకరణపై అవగాహన చాలా ముఖ్యమని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను టి.ఈ.డి “స్టూడెంట్స్ టాక్” కార్యక్రమానికి పంపేందుకు గాను జిల్లా స్థాయిలో ఎంపిక నిర్వహిస్తున్నారు. మండల స్థాయిలో ప్రభుత్వ విద్యార్థుల ఎంపిక కార్యక్రమం మంకమ్మతోటలోని ప్రభుత్వ (దనగర్వాడీ) పాఠశాలలో జరిగింది.