News February 26, 2025
కరీంనగర్: ప్రయాగరాజ్ వెళ్లి వస్తూ చనిపోయాడు..!

కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. వీణవంక మండల కేంద్రానికి చెందిన గౌడ సంఘం సభ్యుడు నల్లగోని వీరయ్య ఇటీవల యూపీలోని ప్రయాగరాజ్‌కు వెళ్లి కుంభమేళాలో పాల్గొని శివయ్యను దర్శించుకున్నాడు. తిరిగి వాహనంలో వస్తున్న క్రమంలో మంగళవారం అర్ధరాత్రి నిజామాబాద్ పట్టణంలోకి రాగానే అతడికి హఠాత్తుగా గుండెపోటు వచ్చి చనిపోయాడు.
Similar News
News February 26, 2025
కీసరలో రోడ్డు ప్రమాదం.. అన్నదమ్ములు మృతి

కీసర PS పరిధిలోని యాదగిరిపల్లిలో ORR సర్వీస్ రోడ్ మీద ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాలు.. గూడూరు చంద్రశేఖర్ (32), మత్స్యగిరి (27) అన్నదమ్ములు. శ్రీను అనే మరో వ్యక్తితో బైక్‌పై బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి వస్తుండగా ORR సర్వీస్ రోడ్‌లో ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది. చంద్రశేఖర్ అక్కడిక్కడే చనిపోయాడు. మత్స్యగిరి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా, మార్చి 20న మత్స్యగిరి వివాహం జరగాల్సి ఉంది.
News February 26, 2025
రికార్డు సృష్టించిన ‘లక్కీ భాస్కర్’

స్టార్ నటుడు దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా వెంకీ అట్లూరి తెరకెక్కించిన ‘లక్కీ భాస్కర్’ సినిమా థియేటర్లతో పాటు ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన 13 వారాల నుంచి ఈ చిత్రం ట్రెండ్ అయి రికార్డు సృష్టించిందని మేకర్స్ ప్రకటించారు. వరుసగా ఇన్ని వారాలు ట్రెండ్ అయిన తొలి సౌత్ఇండియా మూవీ ‘లక్కీ భాస్కర్’ అని ఓ పోస్టర్ విడుదల చేశారు. మీరూ ఈ సినిమా చూశారా?
News February 26, 2025
స్విగ్గీ మెనూలో బీఫ్ ఐటమ్స్.. యూజర్లు ఫైర్

స్విగ్గీ ప్లాట్‌ఫామ్‌లో బీఫ్ ఐటమ్స్‌ను లిస్ట్ చేయడంపై పలువురు యూజర్లు మండిపడుతున్నారు. HYDలోని ఓ రెస్టారెంట్ మెనూలో బీఫ్ ఐటమ్స్‌ను స్విగ్గీ చూపించింది. దీని గురించి ఓ యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘స్విగ్గీని అన్ ఇన్‌స్టాల్ చేస్తాం. బీఫ్ బిర్యానీ అమ్మడం లీగలేనా?’ అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారని GHMC తెలిపింది.