News June 5, 2024
కరీంనగర్: బండికి 44.55 శాతం ఓట్లు

కరీంనగర్ లోక్‌సభ స్థానంలో బండి సంజయ్ 44.55 శాతం ఓట్లను పొందారు. మొత్తంగా 13,13,331 మంది ఓటు హక్కును వినియోగించుకోగా.. ఇందులో 5,85,116 మంది బీజేపీకి ఓటేశారు. 2019 ఎన్నికలతో పోలిస్తే సంజయ్‌కు ఓటు శాతం పెరిగింది. అప్పటి ఎన్నికల్లో 11.47 లక్షల ఓట్లకుగానూ 4,98,276 ఓట్లను పొంది 43.42 శాతం మద్దతును పొందారు. మొత్తంగా 2,25,209 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావుపై విజయం సాధించారు.
Similar News
News November 1, 2025
KNR: తడిసిన ధాన్యాన్ని సేకరిస్తున్నాం: కలెక్టర్

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షానికి తడిసిన ధాన్యాన్ని సేకరిస్తున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 785 మెట్రిక్ టన్నుల తడిసిన ధాన్యాన్ని గుర్తించామని, IKP, PACs ద్వారా కొనుగోలు బాయిల్డ్ రైస్ మిల్స్కు తరలించినట్టు పేర్కొన్నారు. ఇప్పటివరకు కొంతమంది రైతులకు సుమారుగా రూ.57 లక్షలు జమ చేశామని తెలిపారు. మిగతా రైతులకు కూడా జమ అవుతాయన్నారు.
News November 1, 2025
కరీంనగర్: KGBVని పరిశీలించిన అడిషనల్ కలెక్టర్

కరీంనగర్ పట్టణంలోని సప్తగిరి కాలనీలోగల KGBVని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహిస్తున్న Physics Wallah Khan Academy క్లాసులను ఆమె పరిశీలించారు. తరువాత ఇంటర్‌మీడియెట్ మొదటి, రెండో సంవత్సరం BIPC, MPC తరగతులను తనిఖీ చేశారు. కాలేజీలో బోధనా ప్రమాణాలను తెలుసుకొని తగిన సూచనలు చేశారు. విద్యాప్రమాణాల మెరుగుదలపై పాఠశాల సిబ్బందితో అ.కలెక్టర్ చర్చించారు.
News November 1, 2025
కరీంనగర్ సీపీఓగా పూర్ణచంద్రారావు అదనపు బాధ్యతలు

కరీంనగర్ జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి (Chief Planning Officer – CPO)గా పనిచేసిన ఆర్. రాజారాం ఉద్యోగ విరమణ చేయడంతో, ఆ స్థానంలో మంచిర్యాల సీపీఓగా ఉన్న వి. పూర్ణచంద్రారావుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆర్థిక, గణాంకాల శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు వి. పూర్ణచంద్రారావు శుక్రవారం కరీంనగర్ సీపీఓగా బాధ్యతలు స్వీకరించారు.


