News September 23, 2025
కరీంనగర్: బందూకు పట్టిన బడిపంతులు

విద్యాబోధనతో భావి తరాలకు వెలుగులు నింపాల్సిన చేతులు తుపాకీ పట్టి, విప్లవ పోరాటంలో కనుమరుగయ్యాయి. ఉమ్మడి KNR(D) కోహెడ(M) తీగలకుంటపల్లికి చెందిన కట్టా రామచంద్రారెడ్డి.. ఒకప్పుడు భూపాలపల్లి, సిద్దిపేట జిల్లాల్లో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 1989లో విప్లవోద్యమానికి ఆకర్షితులై, భార్యతో కలిసి పీపుల్స్ వార్‌లో చేరారు. ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో సోమవారం రామచంద్రారెడ్డి మృతిచెందిన విషయం తెలిసిందే.
Similar News
News September 23, 2025
స్పెషల్ బస్సుల్లోనే 50% అదనపు ఛార్జీలు: సజ్జనార్

బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా 7 వేలకు పైగా బస్సులను నడుపుతున్నామని TGSRTC ఎండీ సజ్జనార్ తెలిపారు. ప్రత్యేక బస్సుల్లోనే 50% అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నామని, మిగతా బస్సుల్లో సాధారణ ఛార్జీలే ఉన్నాయని పేర్కొన్నారు. ‘బస్సులు తిరుగు ప్రయాణంలో ఖాళీగా వస్తున్నాయి. డీజిల్, మెయింటెనెన్స్ కోసం 50% అదనంగా వసూలు చేస్తున్నాం. ఇది కొత్త పద్ధతి కాదు.. 2003లో ఇచ్చిన GOనే అమలు చేస్తున్నాం’ అని తెలిపారు.
News September 23, 2025
పోలాకి: పిడుగుపడి మహిళ మృతి

పోలాకి మండలం ఉర్జాం గ్రామానికి చెందిన కణితి పద్మావతి (55) మంగళవారం పిడుగుపాటుకు గురై మృతి చెందారు. పొలంలో గాబు తీస్తున్న సమయంలో సమీపంలో పిడుగు పడడంతో మృతి చెందిందని మృతురాలు భర్త కృష్ణారావు తెలిపారు. మృతురాలికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. పద్మావతి మృతితో గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి.
News September 23, 2025
సిరిసిల్ల: మెసేజ్ యువర్ ఎస్పీ.. ఫిర్యాదులకు వాట్సప్ సేవలు

పోలీస్ స్టేషన్‌కు రాలేకపోతున్న ప్రజల కోసం సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి. గీతే కొత్త సదుపాయాన్ని ప్రారంభించారు. ప్రజలు తమ ఫిర్యాదులను నేరుగా వాట్సప్ ద్వారా 6303922572 నంబర్‌కు పంపవచ్చని ఆయన తెలిపారు. శాంతిభద్రతల పర్యవేక్షణే లక్ష్యంగా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చామని ఎస్పీ చెప్పారు. ఈ సదుపాయం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.