News December 6, 2025

కరీంనగర్: బాలికపై అత్యాచారం.. వ్యక్తికి 20ఏళ్ల జైలు

image

2022 ఫిబ్రవరి 3న నమోదైన మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో కరీంనగర్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నగరంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలికపై లైంగిక దాడి చేసిన నేరస్థుడు మడుపు నర్సింహా చారికి శిక్ష పడింది. POCSO చట్టంలోని సెక్షన్ 6 కింద 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1,000/- జరిమానా విధిస్తూ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది.

Similar News

News December 6, 2025

భద్రాద్రి: 3వ విడతలో అందిన నామినేషన్ల వివరాలు

image

మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో చివరి రోజు నాటికి అందిన సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల వివరాలను కలెక్టర్ జితేశ్ వి పాటిల్ వెల్లడించారు. వివరాలిలా.. ఆళ్లపల్లి – 63, 234, గుండాల – 70, 271, జూలూరుపాడు – 124, 452, లక్ష్మీదేవిపల్లి – 164, 661, సుజాతనగర్ – 79, 271, టేకులపల్లి – 244, 685, ఇల్లందు – 196, 680, మొత్తం సర్పంచ్ – 940, వార్డు మెంబర్లు – 3254 మంది నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.

News December 6, 2025

త్వరలో హీరో సుశాంత్‌, హీరోయిన్ మీనాక్షి పెళ్లి? క్లారిటీ..

image

టాలీవుడ్ హీరో సుశాంత్, హీరోయిన్ మీనాక్షి చౌదరి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు SMలో జరుగుతున్న ప్రచారాన్ని ఆమె టీమ్ ఖండించింది. ఇందులో నిజం లేదని, వారిద్దరూ ఫ్రెండ్స్ అని పేర్కొంది. ఏదైనా సమాచారం ఉంటే అఫీషియల్‌గా తామే ప్రకటిస్తామని తెలిపింది. కాగా సుశాంత్ హీరోగా నటించిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ మూవీతో మీనాక్షి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. గతంలోనూ వీరి పెళ్లిపై వార్తలు రాగా మీనాక్షి ఖండించారు.

News December 6, 2025

HYD: మహా GHMC‌లో 250 డివిజన్లు.!

image

గ్రేటర్‌లో శివారు ప్రాంతాలు విలీనమైన నేపథ్యంలో డివిజన్‌ల పునర్విభజన జరుగుతోంది. స్థానిక సంస్థలను డివిజన్‌లను జీహెచ్ఎంసీ అధికారులు మారుస్తున్నారు. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలోకి కొత్తగా 50 డివిజన్లు చేరనున్నాయి. వీటితో జీహెచ్ఎంసీలో 220 నుంచి 250 వరకు డివిజన్‌లు అవనున్నాయి. ఇప్పటికే జనాభా లెక్కన డివిజన్లను విభజించారు. దీంతో మహా జీహెచ్ఎంసీ 10 జోన్లు, 50 సర్కిళ్ళుగా మారుతుంది.