News September 21, 2024
కరీంనగర్: బాలికపై లైంగిక వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు

KNR జిల్లా వీణవంక మండలంలోని ఓ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. SI తిరుపతి ప్రకారం.. మండలంలోని ఐదో తరగతి చదువుతున్న ఓ పదకొండేళ్ల బాలికపై 30 ఏళ్ల వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడటంతో బాధిత కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈనెల 16న కేసు నమోదు చేయగా.. శుక్రవారం అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. బాలిక అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న వ్యక్తి గత కొన్ని రోజులుగా వేధింపులకు గురి చేశాడు.
Similar News
News February 22, 2026
భూసేకరణ వేగవంతం చేయండి: కలెక్టర్

కరీంనగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శనివారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. వరద కాలువ, మిడ్ మానేరు, గౌరవెల్లి వంటి ప్రాజెక్టుల పనుల్లో ఎక్కడా జాప్యం జరగకుండా చూడాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతను గుర్తించి, రైతుల ప్రయోజనాల దృష్ట్యా భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

News February 21, 2026
KNR: టీజీవో డైరీని ఆవిష్కరించిన కలెక్టర్ పమేలా సత్పతి

తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా డైరీ-2026ను కలెక్టర్ పమేలా సత్పతి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీజీవో జిల్లా అధ్యక్షుడు కాళిచరణ్ ఆధ్వర్యంలో గెజిటెడ్ ఉద్యోగులు కలెక్టర్‌ను శాలువాతో సత్కరించారు. అసోసియేషన్ రూపొందించిన ఈ డైరీలో ఉద్యోగులకు అవసరమైన సమాచారం పొందుపరచడం అభినందనీయమని కలెక్టర్ తెలిపారు. ఇది విధుల్లో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.