News March 18, 2025
కరీంనగర్: బాలికలతో కలిసి భోజనం చేసిన కలెక్టర్ పమేలా సత్పతి

తిమ్మాపూర్‌లోని మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా బాలికలతో పాటు భోజనం చేశారు. భోజనం రుచి, నాణ్యతను గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు ఏ సమయానికి ఏయే ఆహారం ఇస్తున్నారని విద్యార్థులను అడిగారు.
Similar News
News March 18, 2025
ఇల్లందకుంట: GREAT.. రాష్ట్ర స్థాయిలో 35వ ర్యాంక్

నిన్న విడుదలైన గ్రేడ్-2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగానికి ఇల్లందకుంట మండలం సిరిసేడుకి చెందిన బీనవేని పరుశురాం ఎంపికయ్యాడు. రాష్ట్ర స్థాయిలో 35వ ర్యాంక్ సాధించి హాస్టల్ వార్డెన్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. పరుశురాముది పేద రైతు కుటుంబం. అయినప్పటికీ కష్టపడి చదివి 2023 పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం పరుశురాం కేయూలో PHD చేస్తున్నాడు.
News March 18, 2025
KNR: ఇంటి వద్దకే రాములు వారి తలంబ్రాలు: ఆర్టీసీ RM

భద్రాచలంలో ఏప్రిల్ 6న శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని పురస్కరించుకొని అక్కడకు వెళ్లలేని భక్తులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ కార్గో ద్వారా సీతారాముల కళ్యాణ తలంబ్రాలను ఇంటి వద్దకే పంపించే ఏర్పాటు చేశామని RM బి.రాజు తెలిపారు. ఇందుకు గాను ఒక్కొక్క ప్యాకెట్ కు రూ.151 ఆన్లైన్ లేదా అన్ని బస్టాండ్ కార్గో సెంటర్లు, ఏజెంట్ కౌంటర్ల వద్ద గాని బుక్ చేసుకోవచ్చని చెప్పారు.
News March 18, 2025
KNR: వలస కార్మికుల పిల్లల చదువును ప్రోత్సహిస్తాం: కలెక్టర్

వలస కార్మికుల పిల్లల చదువులు ప్రోత్సహిస్తామని, ఇందుకోసం జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. వలస కూలీల కార్మికుల యజమానులు, మండల విద్యాధికారులతో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, ఎం.ఈ.ఓలు, ఇటుక బట్టీల యజమానులు పాల్గొన్నారు.