News March 14, 2025

కరీంనగర్: బాల్యంలో ఈ పూలతోనే హోలీ..!

image

కరీంనగర్ జిల్లాలో ఆ చెట్టుకు విరబూసిన పూలు మన బాల్యాన్ని గుర్తుచేస్తున్నాయి. ఒంటిపూట బడికెళ్లుతుంటే రోడ్డు పక్కనే ఇవి గుబాలించేవి. ఈ పూల మకరందం రుచిచూసి మైమరచిన బాల్యం మళ్లీ గుర్తొస్తోంది. పండగొస్తుంది అనే సంబరంలో ఎండలో తిరిగి ఈ పూలను ఒకరోజు ముందే సేకరించేవాళ్లం. నీటిలో ఉడికించి రంగు ఊరిన నీళ్లతో ఆడిన హోలీ బాల్యంలో ఓ మధురజ్ఞాపకమే. ఈ ఏడాదైనా మోదుగ పూలతో హోలీ జరుపుకోండి. HAPPY HOLI

Similar News

News November 10, 2025

ఢిల్లీ ఘటన.. ఉమ్మడి పాలమూరులో విస్తృత తనిఖీలు

image

ఢిల్లీ పేలుళ్ల ఘటన నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా పోలీసులు అప్రమత్తమై, విస్తృత తనిఖీలు చేపట్టారు. జాతీయ రహదారులు, రాష్ట్ర సరిహద్దులైన గద్వాల జిల్లా అలంపూర్, నారాయణపేట జిల్లా కృష్ణ వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. అనుమానాస్పద వస్తువులపై దృష్టి సారించి తనిఖీలు చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరారు.

News November 10, 2025

యాదాద్రి: మధ్యాహ్న భోజనం తనిఖీ చేయనున్న అధికారులు

image

ఈనెల 11, 13న జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించాలని కలెక్టర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని ఎంపిక చేసిన అధికారులచే మధ్యాహ్న భోజనంతో పాటు పాఠశాల పరిసరాలను, మూత్రశాలలను పర్యవేక్షించాలని సూచించారు. పర్యవేక్షించిన అంశాలను చెక్ లిస్ట్ రూపంలో నమోదు చేసి జిల్లా కార్యాలయానికి పంపాలని తెలిపారు.

News November 10, 2025

శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యితో రూ. 251 కోట్ల దోపిడి: పట్టాభి

image

ధనదాహంతో శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేస్తారా అని TDP నేత పట్టాభిరామ్ ప్రశ్నించారు. YCP హయాంలో TTD ఛైర్మన్‌లుగా పనిచేసిన జగన్ బంధువులు తిరుమల పవిత్రతను దెబ్బతీశారని ధ్వజమెత్తారు. YV సుబ్బారెడ్డి హయాంలో ‘భోలే బాబా’ కంపెనీ 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యిని సరఫరా చేసి రూ. 251 కోట్లు దోచుకుందని ఆరోపించారు. అంతేకాకుండా పామాయిల్ పేరుతో ఫేక్ బిల్లులు సృష్టించి రసాయనాలతో నెయ్యి తయారు చేశారన్నారు.