News January 25, 2025

కరీంనగర్: బీఆర్ఎస్‌ను వీడొద్దు.. మేయర్‌కు కేటీఆర్ ఫోన్

image

బీఆర్ఎస్‌కి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన కరీంనగర్ మేయర్ సునీల్ రావుకు బుజ్జగింపుల పర్వం మొదలైంది. సునీల్ రావుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఫోన్ చేశారని సమాచారం. పార్టీని వీడవద్దని సునీల్ రావుకు కేటీఆర్ సూచించారు. భవిష్యత్తులో మళ్లీ బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని తెలిపారు. బీజేపీలో చేరబోతున్నట్లు ఇప్పటికే సునీల్ రావు ప్రకటించారు.

Similar News

News February 18, 2026

విశాఖ: ‘సముద్ర సంప్రదాయాల పట్ల ఐక్యతకు నిదర్శనం ఫ్లీట్ రివ్యూ’

image

అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీక్షించారు. ఈ కార్యక్రమం సముద్ర సంప్రదాయాల పట్ల దేశాల మధ్య ఉన్న ఐక్యత, గౌరవానికి చిహ్నమని ఆమె పేర్కొన్నారు. ప్రపంచ దేశాల నౌకాదళాల సమిష్టి కృషి వల్ల సముద్ర మార్గాలు ప్రపంచాభివృద్ధికి, శ్రేయస్సుకు, మానవాళి సంక్షేమానికి కీలకమైన ద్వారాలుగా మారుతాయని రాష్ట్రపతి ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.

News February 18, 2026

వేములవాడ: మహిళ అనుమానాస్పద మృతి..!

image

వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ ప్రాంతానికి చెందిన వెంగళ రోహిణి (32) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కథలాపూర్ మండలానికి చెందిన రోహిణికి వెంగళ దినేష్‌తో 8 సంవత్సరాల క్రితం వివాహం కాగా ఇద్దరు సంతానం ఉన్నారు. బుధవారం తెల్లవారుజామున ఉరివేసుకుందని, ఆసుపత్రికి తీసుకువెళ్లేలోగా రోహిణి మరణించిందని స్థానికులు తెలిపారు.

News February 18, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో బుధవారం బంగారు, వెండి ధరల వివరాలు.
* 24 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ.14,140
* 10 గ్రాములు వెండి ధర రూ.2,460.