News October 22, 2025
కరీంనగర్: భారత్ నుంచి పాల్గొన్న ఏకైక స్కాలర్

HZB(M) రాంపూర్‌వాసి శ్రీరాములు అంతర్జాతీయ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహించి మన జిల్లా కీర్తిని చాటారు. బెనారస్ హిందూ యూనివర్సిటీ సోషియాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీరాములు మెల్బోర్న్ యూనివర్సిటీ OCT 21- 23 వరకు జరుగుతున్న స్వదేశీ సంస్థాగత అధ్యయనాల అంతర్జాతీయ అకాడమీ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. కాగా, ఈ సదస్సుకు భారత్ నుంచి పాల్గొన్న ఏకైక పరిశోధకలు శ్రీరాములు.
Similar News
News October 22, 2025
జనగామ జిల్లాలో బుధవారం టాప్ న్యూస్!

> ఔట్సోర్సింగ్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
> ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కడియం
> పోచన్నపేట శివారులో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
> జీడికల్ బ్రహ్మోత్సవాలపై కడియం సమీక్ష
> ఇందిరమ్మ ఇండ్ల పనులు వేగవంతం కావాలి: కలెక్టర్
> జనగామ నుంచి శైవ క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
> రైజింగ్ 2047 సర్వేలో పాల్గొనాలి: కలెక్టర్
> ధాన్యం కొనుగోలు సజావుగా జరగాలి: యాస్మిన
News October 22, 2025
ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి: హోంమంత్రి

భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. భారీ వర్షాల హెచ్చరికలతో ఆయా జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి బుధవారం వీక్షణ సమావేశం నిర్వహించారు. సముద్రంలోకి చేపల వేటకు వెళ్లకుండా మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేయాలన్నారు. బాపట్ల జిల్లా నుంచి కలెక్టర్ వినోద్ కుమార్ వీక్షణ సమావేశానికి హాజరయ్యారు.
News October 22, 2025
VKB: భూభారతి ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి: అదనపు కలెక్టర్

రైతుల భూ సమస్యలను పరిష్కరించి, వారికి న్యాయం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో భూభారతి చట్టం ద్వారా స్వీకరించిన భూ సమస్యల పరిష్కారంపై ఆయన సమీక్ష నిర్వహించారు. రైతుల కోసం తీసుకువచ్చిన భూభారతి చట్టాన్ని అధికారులు సమర్థవంతంగా అమలు చేయాలని, దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టకుండా వేగంగా పరిష్కరించాలని సూచించారు.