News September 23, 2025

కరీంనగర్: భూతల్లే వారికి డైనింగ్ టేబుల్..!

image

పొలం పనులకు వెళ్లిన మహిళా కూలీలకు పొలం పక్కన ఉన్న రోడ్డే డైనింగ్ టేబుల్ అయింది. ఉదయం నుంచి అలుపెరగకుండా శ్రమించిన వీరు.. మధ్యాహ్నం వేళ రోడ్డు పక్కనున్న చెట్టు కింద సేదతీరుతూ తెచ్చుకున్న సద్ది బువ్వను తిన్నారు. కష్టానికి అలసట తెలియదు, కన్నీళ్లకు బాధ ఉండదు అన్నట్లుగా తమ నిరాడంబరమైన జీవనశైలితో శ్రమజీవుల కష్టానికి నిలువుటద్దంలా నిలిచిన ఈ దృశ్యం కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పచ్చునూర్లో కన్పించింది.

Similar News

News September 23, 2025

మీరే బకాయిలు పెట్టి మమ్మల్ని అంటారా: లోకేశ్

image

AP: శాసన మండలిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చ సందర్భంగా YCP నేత బొత్సపై మంత్రి లోకేశ్ మండిపడ్డారు. ‘మీరే బకాయిలు పెట్టి మమ్మల్ని అంటారా? సీనియర్ నేత అయ్యుండి బీఏసీలో ఎందుకు మాట్లాడలేదు? నన్ను డిక్టేట్ చేయడం సరికాదు’ అని ఆగ్రహించారు. తమ హయాంలో బకాయిలు పెట్టలేదని, లోకేశ్ మాటలు సరిగాలేవని బొత్స బదులిచ్చారు. కాగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై YCP ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ఛైర్మన్ తిరస్కరించారు.

News September 23, 2025

గిద్దలూరులో పుట్టిన బిడ్డను వదిలేసిన తల్లి

image

గిద్దలూరులో అమానుష ఘటన వెలుగు చూసింది. ఓ ప్రైవేటు వైద్యశాలకు సోమవారం అర్ధరాత్రి ప్రసవ వేదనతో ఓ గర్భిణీ వచ్చింది. డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో టాయిలెట్ వద్ద మగ శిశువుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆ బిడ్డను అక్కడే వదిలి వెళ్లిపోయింది. వైద్య సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆ మహిళ ఎవరు? ఎందుకు అలా చేసింది? అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు.

News September 23, 2025

NLG: స్థానికంలో రొటేషన్.. మారనున్న స్థానాలు!

image

జిల్లాలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించనుండటంతో ఇప్పటివరకు ఉన్న రిజర్వేషన్లు అన్నీ మారిపోనున్నాయి. BRS ప్రభుత్వ హయాంలో 2 సార్లు నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పటి వరకు ఉన్న రిజర్వేషన్లనే అమలు చేశారు. ప్రస్తుతం వాటిని తొలగించి రిజర్వేషన్ల రొటేషన్ పద్ధతిని అమలు చేయనున్నారు. ఈసారి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో అధిక సంఖ్యలో సీట్లు లభించనున్నాయి.