News October 24, 2025

కరీంనగర్: మద్యం దరఖాస్తులు ఎన్నంటే..?

image

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు గురువారంతో ముగిసింది. నాలుగు జిల్లాల్లోని మొత్తం 287 వైన్‌షాపులకు గానూ 7,565 దరఖాస్తులు వచ్చాయి. కరీంనగర్‌ (94 షాపులు): 2,730 దరఖాస్తులు (చివరి రోజు 77), పెద్దపల్లి (74 షాపులు): 1,488 దరఖాస్తులు (చివరి రోజు 94), జగిత్యాల (71 షాపులు): 1,966 దరఖాస్తులు (చివరి రోజు 119), రాజన్న సిరిసిల్ల (48 షాపులు): 1,381 దరఖాస్తులు (చివరి రోజు 48).

Similar News

News October 24, 2025

పత్తి సేకరణలో సందేహాలు నివృత్తి చేయాలి: కలెక్టర్

image

పత్తి రైతుల రిజిస్ట్రేషన్ ప్రారంభించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా వ్యవసాయ మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. పత్తి, ధాన్యం కొనుగోలు పై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. రైతు సేవా కేంద్రం వారిగా రైతులతో సమావేశం నిర్వహించి పూర్తి వివరాలు తెలియజేయాలన్నారు. ప్రాంతాల వారీగా పత్తి ఉత్పాదకత వివరాలు సమర్పించాలని ఆదేశించారు. పత్తి సేకరణలో తరచూ తలెత్తే సందేహాలను స్పష్టంగా నివృత్తి చేయాలన్నారు.

News October 24, 2025

వరి A గ్రేడ్ రకానికి రూ.2,389 మద్దతు ధర

image

కేంద్ర ప్రభుత్వం రబీ పంటలకు మద్దతు ధర(క్వింటాకు) ప్రకటించింది. వరికి A గ్రేడ్ రకానికి రూ.2389, సాధారణ రకానికి రూ.2369 చెల్లించనున్నారు. మొక్కజొన్నకు రూ.2400, పత్తిపొడవు రకం రూ. 8110, మినుములు రూ.7800, పెసలు రూ.8768, కందులు రూ.8000, జొన్నలు రూ.3699, నువ్వులు రూ.9846, సజ్జలు రూ.2775, రాగులు రూ.4886, వేరుశనగకు రూ.7263 చొప్పున మద్దతు ధరలను ప్రకటించింది. పోస్టర్‌ను JC వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు.

News October 24, 2025

హుజూరాబాద్: బాలిక డెడ్‌బాడీతో MLA కౌశిక్ రెడ్డి నిరసన

image

హుజూరాబాద్ మండలం రాంపూర్‌కు చెందిన <<18088701>>బాలిక వనం శ్రీవర్ష<<>> భీమదేవరపల్లి మండలం వంగర గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతూ ఈరోజు ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కేంద్రం వద్ద సందర్శించి, అనంతరం బాలిక మృతదేహంతో స్థానిక అంబేడ్కర్ చౌరస్తా వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. బాలిక కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.