News March 11, 2025
కరీంనగర్: మనం ప్రమాదకరమైన గాలిపీలుస్తున్నాం..!

కర్బన ఉద్గారాలతో గాలి నాణ్యత తగ్గి, భిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడి ప్రజలు ఉక్కరిబిక్కిరి అవుతున్నారు. గాలి నాణ్యత విలువ 0-50 ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 51-100ఉంటే పర్వాలేదని, 101-150 ఉంటే పెద్దలూ, పిల్లల్లో ఊపిరితిత్తులు, ఇతర వ్యాధులు రావొచ్చని హెచ్చరిస్తున్నారు. 201-300 ఉంటే అందరికి వచ్చే ప్రమాదముంది. కరీంనగర్‌లో గాలినాణ్యత విలువ 104గా ఉంది. ఇప్పటికైనా మనం మారాల్సిన అవసరముంది. ఏమంటారు!
Similar News
News March 11, 2025
హుజూరాబాద్: జ్వరంతో పదోతరగతి విద్యార్థిని మృతి

హుజూరాబాద్ మండలం చెల్పూర్‌కు చెందిన బండారి రమ్య జ్వరంతో బాధపడుతూ ఈరోజు మృతి చెందినట్లు తెలిపారు. రమ్య గ్రామంలోని పాఠశాలలో పదోతరగతి చదువుతోంది. అయితే ఆమెకు వారం రోజుల క్రితం జ్వరం రాగా హనుమకొండలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈ క్రమంలో మంగళవారం జ్వరం తీవ్రతరం కావడంతో మృతిచెందిందని తల్లిదండ్రులు తెలిపారు.
News March 11, 2025
గంగారం మృతికి కేంద్రమంత్రి బండి సంజయ్ సంతాపం

రాజన్న సిరిసిల్ల జిల్లా TGSP 17వ బెటాలియన్ కమాండెంట్ గంగారాం మృతిపట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదవశాత్తు అయిన లిఫ్టులో పడి మృతి చెందడం బాధాకరమని అన్నారు. గంగారాం కుటుంబ సభ్యులకు బండి సంజయ్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గంగారాం ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలిగించాలని అన్నారు.
News March 10, 2025
కరీంనగర్: జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన సీపీ

కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన గౌస్ ఆలం కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని మర్యాదపూర్వకంగా కలిశారు. కరీంనగర్ కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి పూల మొక్కను అందజేశారు. అనంతరం కరీంనగర్ జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు అధికారులు చర్చించారు.