News March 19, 2025
కరీంనగర్: మాదకద్రవ్యాల నిర్మూలనకు పకడ్బందీ చర్యలు: కలెక్టర్

మాదకద్రవ్యాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, యువత మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మత్తుపదార్థాల నిర్మూలనలో భాగంగా పోలీస్, ఎక్సైజ్ సహా వివిధశాఖల అధికారులతో బుధవారం ఆమె సమన్వయ సమావేశం నిర్వహించారు. కళాశాలలో వివిధ వసతి గృహాలను సందర్శించాలన్నారు. అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసే విద్యార్థులు పెడదోవ పట్టకుండా చూడాలని ఆదేశించారు.
Similar News
News March 20, 2025
KNR: ఆహార నాణ్యతపై విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలి: కలెక్టర్

కరీంనగర్ జిల్లాలోని ప్రైవేట్, ప్రభుత్వ హాస్టళ్లు, హోటల్లు ఆహార తయారు చేసే కేంద్రాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బుధవారం ఆమె సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆహార నాణ్యతపై ఫుడ్ సేఫ్టీ అధికారులు నిత్యం తనిఖీలు నిర్వహించాలన్నారు. నాసిరకమైన ఆహారం తయారు చేయడం పట్ల కఠినచర్యలు తీసుకోవాలన్నారు. వాటికోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలన్నారు.
News March 19, 2025
తిమ్మాపూర్: విద్యుత్తుషాక్‌తో నెమలి మృతి

తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణాపూర్ కాలనీలో విద్యుత్‌శాఖతో నెమలి మృతిచెందింది. గమనించిన గ్రామస్థులు ఫారెస్ట్ అధికారులకు సమాచారమందించారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు నెమలి వద్దకు చేరుకుని విద్యుత్‌తీగలను పరిశీలించారు. అనంతరం నెమలిని పోస్టుమార్టం నిమిత్తం తీసుకెళ్లారు.
News March 19, 2025
సైదాపూర్: పుట్టెడు దుఃఖంలో ఇంటర్ పరీక్ష రాసిన విద్యార్థి

సైదాపూర్ మండలం ఆరెపల్లి గ్రామనికి చెందిన బూర్గుల అభిరామ్ పుట్టెడు దు:ఖంలోనూ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష రాశాడు. అభిరామ్ తండ్రి రాజేశ్వర్‌రావు మృతిచెందగా తండ్రి మృతదేహం ఇంటిదగ్గర ఉండగానే పరీక్ష రాసొచ్చి అనంతరం తండ్రి అంత్యక్రియలు నిర్వహించారు. తండ్రి చితికి అభిరామ్ నిప్పంటించాడు. విద్యార్థిని బంధువులు, గ్రామస్థులు ఆవేదన చెందారు.