News February 18, 2025
కరీంనగర్: మార్చి 6 నుంచి ‘పల్లె బాట’: జక్కని

బీసీల పోరాటాన్ని తెలంగాణలోని పల్లెల్లో విస్తృత పరుస్తామని, దాని కోసం కార్యాచరణలు ముందుకు సాగుతున్నామని బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీల జాగృతి కోసం మార్చి 6 నుంచి గ్రామ గ్రామాన పల్లెబాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ పల్లెబాటని విజయవంతం చేయాలని కోరారు.
Similar News
News December 14, 2025
మలయాళ నటుడు ఆత్మహత్య!

మలయాళ నటుడు అఖిల్ విశ్వనాథ్(30) మృతి చెందారు. తల్లి చూసేసరికి అఖిల్ ఇంట్లో శవమై కనిపించారు. అతను ఆత్మహత్య చేసుకున్నారన్న అనుమానాలున్నాయి. అఖిల్ లీడ్ రోల్ ప్లే చేసిన ‘చోలా’ చిత్రానికి 2019లో కేరళ స్టేట్ అవార్డ్ లభించింది. అతను మొబైల్ షాపులో మెకానిక్‌గా చేస్తున్నారని, కొన్నాళ్లుగా ఆ పనికీ వెళ్లట్లేదని తెలుస్తోంది. బైక్ ప్రమాదంలో గాయపడిన అఖిల్ తండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
News December 14, 2025
సిద్దిపేట జిల్లాలో 9 AM @ 23.25% పోలింగ్

సిద్దిపేట జిల్లాలోని పది మండలాల్లో జరుగుతున్న పోలింగ్‌లో ఉదయం 9 గంటలకు 23.25% నమోదైనట్లు జిల్లా అధికారులు తెలిపారు. అక్బర్‌పేట-భూంపల్లిలో 19.61%, బెజ్జంకి- 23%, చిన్నకోడూరు- 21.76%, దుబ్బాక- 23.50%, మిరుదొడ్డి- 18.60%, నంగునూరు-25.06%, నారాయణరావుపేట- 23.67%, రూరల్- 27.98%, అర్బన్- 25.10%, తొగుట-23.80% పోలింగ్ నమోదైందని అధికారులు వెల్లడించారు.
News December 14, 2025
జగిత్యాల జిల్లాలో పోలింగ్ శాతం ఎంతంటే?

జగిత్యాల జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు మండలాల వారీగా పోలింగ్ ఇలా నమోదైంది. బీర్పూర్ మండలంలో 18.31%, జగిత్యాల మండలంలో 22.14%, జగిత్యాల రూరల్ మండలంలో 23.41%, కొడిమ్యాల మండలంలో 19.41%, మల్యాల మండలంలో 17.39%, రాయికల్ మండలంలో 22.11%, సారంగపూర్ మండలంలో 19.84% పోలింగ్ జరిగింది. అన్ని మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.


