News February 11, 2025
కరీంనగర్: ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు

కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల శాసనమండలి ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఘట్టం నిన్నటితో ముగిసింది. సోమవారం పోటాపోటీగా ర్యాలీలు నిర్వహించి నామినేషన్లు వేశారు. మొత్తం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 100 మంది, ఉపాధ్యాయుల స్థానానికి 17 మంది నామినేషన్లు వేశారు. నేడు నామినేషన్లను పరిశీలిస్తారు. ఉపసంహరణకు ఈనెల 13న మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉంటుంది.
Similar News
News September 19, 2025
GDK: లాభాల వాటా ప్రకటించరా?: TBGKS

సింగరేణి లాభాల వాటా ప్రకటించకపోవడంపై కార్మికులు ఆందోళన చెందుతున్నారని, వెంటనే వాటా ప్రకటించాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు వాటా ప్రకటించకపోవడం ఏంటని ప్రశ్నించారు. కార్యక్రమంలో సంఘం శ్రేణులు పాల్గొన్నారు.
News September 19, 2025
ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్‌కు పదోన్నతి

రాష్ట్ర వ్యాప్తంగా ఐదుగురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్‌కు సైతం పదోన్నతి లభించింది. ఈ మేరకు ఆమెకు అదనపు ఎస్పీగా పదోన్నతి కల్పించారు. తిరిగి యధా స్థానంలో అదనపు ఎస్పీగా కొనసాగనున్నారు. ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు.
News September 19, 2025
పెద్దపల్లి: మాల మహానాడు జిల్లా అధ్యక్షుడిగా మధు

పెద్దపల్లి జిల్లా జాతీయ మాల మహానాడు అధ్యక్షుడిగా కట్టేకోల మధుని నియమించారు. రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఈ విషయాన్ని తెలిపారు. ప్రధాన కార్యదర్శిగా ఆముల శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా పోచం మల్లయ్య, ఉపాధ్యక్షులుగా మద్దెల రామకృష్ణ, మట్ట రాజయ్య, కార్యదర్శులుగా చెవుల రాజయ్య, బండ రాజులను నియమించారు. తన నియామకానికి సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపార