News December 17, 2025

కరీంనగర్: ముగిసిన మూడో పోరు.. విజేత ఎవరో..?

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 388 GPలకు, 1580 వార్డులకు జరిగిన మూడో పోరు ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది. ముందుగా వార్డు సభ్యుల బ్యాలెట్లను లెక్కించనున్నారు. 25 ఓట్లను ఓ కట్టగా కట్టి, ఆ తర్వాత వార్డుల వారీగా లెక్కించనున్నారు. వార్డులు ముగిసిన వెంటనే సర్పంచ్ కౌంటింగ్ పూర్తి చేస్తారు. అనంతరం ఉప సర్పంచ్‌ను కూడా ప్రకటించే అవకాశం ఉంది.

Similar News

News December 27, 2025

తూ.గో: యువత రీల్స్ పిచ్చి.. మృత్యువుకు ఆహ్వానం!

image

గోపాలపురం జాతీయ రహదారి16 మృత్యుదారిగా మారుతోంది. గుండుగొలను-కొవ్వూరు మధ్య సోషల్ మీడియా పిచ్చితో యువత చేస్తున్న విన్యాసాలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. నిబంధనలు తుంగలో తొక్కి అపసవ్య దిశలో, అతివేగంతో ప్రయాణిస్తూ యువకులు దుర్మరణం చెందుతున్నారు. కాగా, ఈరోజు ఇదేరోడ్డుపై ముగ్గురు మృత్యువాతపడిన సంగతి తెలిసిందే. ఇప్పటికైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

News December 27, 2025

ముక్కలు కాబోతున్న అన్నమయ్య జిల్లా?

image

అన్నమయ్య జిల్లా ముక్కలు కాబోతున్నట్లు తెలుస్తోంది. రాయచోటిని మదనపల్లె జిల్లాలో, రాజంపేటను కడప జిల్లాలో, రైల్వే కోడూరును తిరుపతిలో కలుపుతున్నట్లు సమాచారం. అయితే రాయచోటి జిల్లా కేంద్రంగా ఉంటుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇవాళ జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం దీనిపై చర్చించినట్లు తెలుస్తోంది.

News December 27, 2025

నెల్లూరులో కలవనున్న గూడూరు?

image

జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష చేశారు. సమీక్షలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, అనిత, పొంగూరు నారాయణ పాల్గొన్నారు. స్థానిక నేతల విజ్ఞప్తితో గూడూరును నెల్లూరులో కలిపే అంశంపై కసరత్తు చేస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.