News September 28, 2025
కరీంనగర్: ముగిసిన ల్యాండ్ సర్వే శిక్షణ..!

కరీంనగర్ జిల్లాలో ల్యాండ్ సర్వేయింగ్ అప్రెంటిషిప్ ముగిసిందని అధికారులు తెలిపారు. ఈమేరకు శనివారం జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంలో ల్యాండ్, సర్వే సెటిల్‌మెంట్ ఏడీ ప్రభాకర్‌ను జమ్మికుంట, హుజూరాబాద్ ట్రైనీ సర్వే అభ్యర్థులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఏడీ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్లు, ట్రైనింగ్ అభ్యర్థులు ఉన్నారు.
Similar News
News October 23, 2025
ముగిసిన నామినేషన్ల పర్వం.. NOV 1న పోలింగ్

కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఈరోజు వరకు మొత్తం 73 నామినేషన్లు దాఖలయ్యాయని, రేపు పరిశీలన జరగనుందని, 25న ఉపసంహరణ జరగనుందని ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ తెలిపారు. నవంబర్ 1న కరీంనగర్ మహిళా డిగ్రీ కళాశాల & జగిత్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలింగ్ జరగనుందని, ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్నికల అధికారి పేర్కొన్నారు.
News October 23, 2025
డ్రగ్స్ నిర్మూలనకు అందరూ సహకరించాలి: జిల్లా కలెక్టర్

డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం ప్రారంభించి ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మహిళలు, పిల్లలు దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మహిళలకు, కళాశాల విద్యార్థులకు డ్రగ్స్‌తో కలిగే అనర్థాలను తెలియపరిచేందుకు రంగోలీ పోటీలు నిర్వహించారు.
News October 23, 2025
కరీంనగర్: సిటిజన్ సర్వేకు ప్రజల స్పందన

తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు రూపకల్పనకై ఉద్దేశించిన తెలంగాణ రైజింగ్-2047 సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. భారతదేశ స్వాతంత్రానికి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలో ప్రజల నుంచి సలహాలు సూచనలు తీసుకోవడానికి ప్రభుత్వం గతవారం ప్రారంభించిన సర్వే ఈ నెల 25న ముగుస్తుంది. వెబ్సైట్‌ను సందర్శించి సలహాలు సూచనలు తెలపాలని కలెక్టర్ సూచించారు.