News September 1, 2025

కరీంనగర్ ముదిరాజ్ సమస్యలపై నీలం మధుతో సమావేశం

image

హైదరాబాద్ పటాన్‌చెరులోని నీలం మధు నివాసంలో కరీంనగర్ జిల్లా TMPS నాయకులు ఆయనను కలిశారు. కూనచల మహేందర్, కీసర సంపత్, పెసరు కుమారస్వామి, అరిగే ప్రభాకర్, జోడు బాలరాజు, భూమ ప్రవీణ్ పాల్గొన్న ఈ సమావేశంలో ముదిరాజ్ సమాజ సమస్యలు, సంక్షేమం, రాజకీయ అభివృద్ధిపై చర్చించారు. సమాజ అభ్యున్నతికి అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

Similar News

News September 1, 2025

కరీంనగర్: ప్రజావాణికి 269 దరఖాస్తులు

image

KNR కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 269 మంది అర్జీదారులు దరఖాస్తులు సమర్పించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులకు బదిలీ చేస్తూ దరఖాస్తులను వెనువెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలోని అన్ని పెండింగ్ దరఖాస్తులను వారం రోజుల్లోగా పరిష్కరించాలని ఆదేశించారు.

News September 1, 2025

KNR: ‘పెన్షన్ అనేది బిక్ష కాదు, ఉద్యోగుల హక్కు’

image

జిల్లా కలెక్టరేట్ ఎదురుగా KNR ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లందరూ పెన్షన్ విద్రోహక దినం సందర్భంగా నల్ల బ్యాడ్జీలు, టిషర్ట్లు ధరించి నిరసన కార్యక్రమంలో‌ పాల్గొన్నారు. JAC చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. పెన్షన్ అనేది బిక్ష కాదు, ఉద్యోగుల హక్కు అని అన్నారు. 30–35 సంవత్సరాలు ప్రజలకు సేవ చేసిన తర్వాత వృద్ధాప్యంలో వారికి ఇచ్చే పెన్షన్ అనేది కేవలం ఆర్థిక సహాయం కాదన్నారు.

News September 1, 2025

కరీంనగర్ జిల్లాకు మొండిచేయి

image

సికింద్రాబాద్- నాగ్‌పూర్ మధ్య నడిచే వందేభారత్ రైలు (నంబరు 20101/02)కు మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో హాల్టింగ్ కల్పించిన విషయం తెలిసిందే. అయితే, జమ్మికుంట రైల్వే స్టేషన్‌లో కూడా హాల్టింగ్ కల్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. జమ్మికుంటలో హాల్టింగ్ కల్పిస్తే.. HZBD, HSNB, పరకాల, భూపాలపల్లి, మానకొండూరు ప్రాంత ప్రజలకు ప్రయోజనం కలగనుంది. సమస్యపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ చొరవ చూపాలని కోరుతున్నారు.