News December 10, 2025

కరీంనగర్: మూడో విడతతో 20 GPలు ఏకగ్రీవం

image

గ్రామపంచాయతీ మూడో విడత ఎన్నికల్లో 20 గ్రామపంచాయతీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ధ్రువీకరించారు. జగిత్యాల జిల్లాలో 6, సిరిసిల్ల – 7, కరీంనగర్ – 1, పెద్దపల్లి జిల్లాలో 6 గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. కాగా, మొదటి విడత రేపు పోలింగ్ జరగనుండగా, రెండో విడత 14న, విడత మూడో విడత 17న పోలింగ్, అదేరోజు సాయంత్రం ఫలితాలను వెల్లడిస్తారు.

Similar News

News December 12, 2025

నిర్మల్: పరీక్షను పగడ్బందీగా నిర్వహించాలి

image

నిర్మల్ జిల్లాలో శనివారం నిర్వహించే నవోదయ పరీక్షను పగడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ ముడారపు పరమేశ్వర్ సూచించారు. జిల్లాలో పరీక్ష కేంద్రాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 1552 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారని వారందరికీ పరీక్ష కేంద్రాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవాలన్నారు.

News December 12, 2025

పొగమంచు వేళల్లో వాహనాల రాకపోకలపై నిషేధం: అనిత

image

AP: ఏజెన్సీ ప్రాంతాల్లో వాహన ప్రమాదాల నేపథ్యంలో రాత్రి పూట పొగమంచు వేళల్లో బస్సు, ఇతర వాహన రాకపోకలను నిషేధిస్తున్నట్లు మంత్రి అనిత తెలిపారు. చింతూరు-మారేడుమిల్లి రోడ్డులో BUS ప్రమాదంలో 9మంది మృతి బాధాకరమన్నారు. ‘మృతుల కుటుంబాలకు పరిహారమిస్తాం. ఘాట్ రోడ్లలో వాహనాలు నడిపేవారికి ప్రత్యేక డ్రైవింగ్ లైసెన్స్ ఉండేలా చర్యలు తీసుకుంటాం. చిన్న తప్పిదాల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి’ అని పేర్కొన్నారు.

News December 12, 2025

NHIDCL 64 పోస్టులకు నోటిఫికేషన్

image

<>NHIDCL <<>>64 అసోసియేట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 18 నుంచి జనవరి 12వరకు అప్లై చేసుకోవచ్చు. సివిల్ ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. జీతం నెలకు రూ.70,000-రూ.80,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.nhidcl.com