News March 9, 2025
కరీంనగర్: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు నిధుల మంజూరు

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం నిధులు రూ.11,000 కోట్లను మంజూరు చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని మంథని, చొప్పదండి, ధర్మపురి, జగిత్యాల, మానకొండూర్, పెద్దపల్లి, రామగుండంలో నిర్మిస్తున్న ప్రతి స్కూల్‌కు రూ.200 కోట్ల నిధులను కేటాయించింది.
Similar News
News November 6, 2025
SRP: డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పణకు శిబిరాలు

సింగరేణిలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులు నవంబర్‌లో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేందుకు అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు యాజమాన్యం వెల్లడించింది. ఈ నెల 12, 13 తేదీల్లో శ్రీరాంపూర్, 17, 18 తేదీల్లో మందమర్రి, 24, 25 తేదీల్లో బెల్లంపల్లి, గోలేటి ఏరియాల్లో శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ అవకాశాన్ని సీఎంపీఎస్, సీపీఆర్ఎంఎస్ లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.
News November 6, 2025
హనుమకొండ బీఈడ్ కళాశాలలో ఖాళీలు

హనుమకొండలోని బీఈడ్ కళాశాలలో ఖాళీగా ఉన్న మూడు పోస్టుల కోసం దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ ఎం.డి. అబ్దులై తెలిపారు. కళలు-కళావిద్య, ఫిలాసఫీ, పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టుల్లో పీజీతో పాటు ఎంఈడ్ పూర్తి చేసిన, 65 ఏళ్లలోపు ఉన్న అర్హులు ఈ నెల 13 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News November 6, 2025
ఖతార్‌లో ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారా?

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఖతార్‌లో సూపర్‌వైజర్ పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. డిప్లొమా, టెక్నికల్ సర్టిఫికెట్‌తో పాటు పని అనుభవం గలవారు ఇవాళ్టి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నెలకు రూ.1,94,000 నుంచి రూ.2,38,000 వరకు చెల్లిస్తారు. వయసు 45ఏళ్ల లోపు ఉండాలి. వెబ్‌సైట్: https://naipunyam.ap.gov.in/


