News September 6, 2025
కరీంనగర్: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న డా.కాంపల్లి అర్జున్

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా HYDలోని శిల్పకళా వేదికలో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా వేడుకలను నిర్వహించింది. ఈ మేరకు KNRలోని SRR ప్రభుత్వ కళాశాలలో వాణిజ్య విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న డా.కాంపల్లి అర్జున్ తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుని అందుకున్నారు. అర్జున్ మాట్లాడుతూ.. ఈ అవార్డు ఉపాధ్యాయుడి కృషికి రాష్ట్రం ఇచ్చిన గౌరవమన్నారు.
Similar News
News September 5, 2025
KNR: వినాయక నిమజ్జనం.. పోలీసుల సూచనలు

శుక్రవారం జరిగే వినాయక నిమజ్జనం సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ పోలీసులు పలు సూచనలు చేశారు.
☞ విగ్రహాలు కరెంటు వైర్లకు తగలకుండా చూసుకోవాలి.
☞ క్రేన్ల ద్వారా మాత్రమే విగ్రహాలను నిమజ్జనం చేయాలి.
☞ ఈత రానివారు నీటి వద్దకు వెళ్లకూడదు.
☞ హైటెన్షన్ వైర్ల వద్ద విగ్రహాలను జాగ్రత్తగా తీసుకెళ్లాలి.
☞ వాహనాల్లో వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి.
పోలీసుల సూచనలు పాటిస్తూ నిమజ్జనంలో పాల్గొనండి.
News September 5, 2025
KNR: నేడు గంగమ్మ ఒడికి గణనాథులు

నవరాత్రులు పూజలందుకున్న ఏకదంతుడు నేడు గంగమ్మ ఒడికి చేరనున్నాడు. ఈ మేరకు ఉమ్మడి KNR జిల్లా అంతటా గణేష్ నిమజ్జన శోభాయాత్రను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే కొన్ని విగ్రహాలను నిమజ్జనం చేశారు. DJలను నిషేధించినట్లు పోలీసులు ప్రకటించడంతో నిర్వాహకులు కోలాటాలు, సాంస్కృతిక ప్రదర్శనలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
News September 5, 2025
KNR: స్టేట్ లెవెల్ బెస్ట్ టీచర్‌గా సత్యనారాయణ

స్టేట్ లెవెల్ బెస్ట్ టీచర్ అవార్డుకి వీణవంక మండలంలోని ఎలుబాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న కే.సత్యనారాయణ ఎంపికయ్యారు. ఈయన చేసిన విశేష సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డుతో సత్కరించడంతో పాటు స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి కల్పించింది. గతంలో చెల్పూరు పాఠశాలలో 36 మంది విద్యార్థులను బాసర ఐఐఐటీకి, 32 మంది నేషనల్ మెయిన్స్ మెరిట్ స్కాలర్షిప్‌కి ఎంపిక అవ్వటంలో ఈయన విశేష కృషి చేశారు.