News October 10, 2025

కరీంనగర్: రిజర్వేషన్లు సాధించడంలో కాంగ్రెస్ విఫలం: గంగుల

image

బీసీ రిజర్వేషన్లు సాధించడంలో కాంగ్రెస్ విఫలమైందని బీఆర్‌ఎస్ నేతలు గంగుల కమలాకర్, సుంకే రవిశంకర్ తీవ్ర విమర్శలు చేశారు. 42% రిజర్వేషన్‌పై హైకోర్టు స్టే విధించడం కాంగ్రెస్ చేసిన కోర్టు డ్రామా అని ఆరోపించారు. పిటిషనర్ల తరఫున ఫీజు కట్టి, బీసీలను మోసం చేస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీతో పాటు ప్రతిపక్షాలు పూర్తి మద్దతు ఇచ్చినా రిజర్వేషన్లు సాధించడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు.

Similar News

News October 10, 2025

కనిగిరి: సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు కౌన్సెలింగ్‌ పూర్తి

image

మెగా డీఎస్సీ ద్వారా ఎంపికైన సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు కౌన్సెలింగ్‌ పూర్తయినట్లు ప్రకాశం డీఈవో కిరణ్‌కుమార్‌ తెలిపారు. కనిగిరిలోని ఆల్ఫా అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో కౌన్సెలింగ్‌ నిర్వహించి పోస్టింగ్ ఇచ్చారు. జిల్లాలో 124 మంది సెకండరీ గ్రేడ్‌ తెలుగు, ఉర్దూ ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైనట్లు తెలిపారు. సదరు టీచర్లు సోమవారం నుంచి వారికి కేటాయించిన పాఠశాలల్లో చేరతారన్నారు.

News October 10, 2025

నేడు వర్ధన్నపేటలో మెగా జాబ్ మేళా..!

image

వర్ధన్నపేటలో నేడు యువ పరివర్తన ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. సాఫ్ట్‌వేర్, ఫైనాన్స్, మార్కెటింగ్, హెల్త్‌కేర్, టెక్నీషియన్, టైలరింగ్, బ్యూటిషన్, మెకానిక్, తదితర రంగాల్లో దాదాపు 300కు పైగా ఖాళీలను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ జాబ్ మేళాకు 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజినీరింగ్, ఐటీఐ, డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు వారి విద్యార్హతలను బట్టి దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News October 10, 2025

బిజినెస్ న్యూస్ రౌండప్

image

* 2025-26 FY రెండో త్రైమాసికంలో రూ.12,075 కోట్ల నికర లాభం ప్రకటించిన TCS. ఒక్కో షేర్‌పై రూ.11 మధ్యంతర డివిడెండ్ ప్రకటన
* LG ఎలక్ట్రానిక్స్ IPO సూపర్ సక్సెస్: 7.13 కోట్ల షేర్లు జారీ చేయగా 385 కోట్ల షేర్లకు బిడ్స్ దాఖలు. వీటి విలువ దాదాపు రూ.4.4 లక్షల కోట్లు. ఇవాళ IPO అలాట్‌మెంట్
* నేడు భేటీ కానున్న టాటా సంస్థల ట్రస్టీలు. కొద్దిరోజులుగా బోర్డు సభ్యుల మధ్య నెలకొన్న విభేదాలకు తెరదించే అవకాశం