News September 11, 2025
కరీంనగర్: రూ.947.21 కోట్లతో ‘హ్యామ్’ రోడ్ల విస్తరణ

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రహదారుల అభివృద్ధికి హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటి మోడ్) ప్రోగ్రాం కింద ఆర్అండ్‌బీ రూపొందించిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. రూ.947.21 కోట్లతో 48 పనులు చేపట్టి 616.41 కి.మీ. మేర పనులు పూర్తి చేయనున్నారు. కొత్త రోడ్లను నిర్మించడమే కాకుండా పాత వాటిని విస్తరించడం, రిపేర్లు చేస్తారు. ఫలితంగా గ్రామీణ రోడ్లు జిల్లా కేంద్రాలకు లింక్ అయి ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది.
Similar News
News September 11, 2025
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు: ఏఎస్‌పీ మౌనిక

ఏప్రిల్‌లో దేవరకొండలోని హనుమాన్ నగర్‌లో జరిగిన దొంగతనం కేసులో నిందితుడు పిట్ట గంగాధరను అరెస్టు చేసినట్లు ఏఎస్‌పీ మౌనిక తెలిపారు. నిందితుడి వద్ద నుంచి రూ.2.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ దొంగతనంలో రూ. 6 లక్షల నగదు, 2.2 తులాల బంగారం చోరీకి గురయ్యాయని.. నిందితుడిపై సుమారు 100కు పైగా దొంగతనం కేసులు ఉన్నట్లు ఏఎస్‌పీ తెలిపారు.
News September 11, 2025
కృష్ణా: జెడ్పీ సమావేశంలో కీలక నిర్ణయం

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ZPTCల పెండింగ్‌లో ఉన్న గౌరవ వేతనాలకు సంబంధించి గురువారం జరిగిన సర్వసభ్య సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. 18 నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనం రూ.74.93 లక్షలు ZP సాధారణ నిధుల నుంచి చెల్లింపునకు సమావేశంలో ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని ఛైర్‌పర్సన్ హారిక నిండు సభలో తెలియజేయగా సభ్యులు హర్షాతి రేకాలు వ్యక్తం చేశారు. గౌరవ వేతనం కోసం సభ్యులు గత కొంతకాలంగా పోరాడుతున్న విషయం తెలిసిందే.
News September 11, 2025
జగిత్యాల: బావిలో దూకి యువతి SUICIDE

జగిత్యాల అర్బన్(M) ధరూర్‌కు చెందిన బాలె లక్ష్మణ్-పద్మల కుమార్తె దివ్య(26) బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. బయటకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన దివ్య ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా, గ్రామ పొలిమేరలోని ఓ వ్యవసాయ బావిలో ఆమె మృతదేహం లభ్యమైంది. దివ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మానసికంగా కుంగిపోయిందని, అందుకే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని గ్రామస్థులు అనుమానిస్తున్నారు.