News August 21, 2024

కరీంనగర్: రైతు భరోసా కోసం ఎదురుచూపులు!

image

కరీంనగర్ జిల్లాలోని రైతులు రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. వానకాలం సాగు మొదలై 2 నెలలు కావొస్తున్నా రైతు భరోసా పథకం అమలు ఊసేలేదు. రైతులు పెట్టుబడుల కోసం అప్పులు చేస్తున్నారు. కాగా జిల్లాలో 3,45,070 ఎకరాల్లో పంటలు సాగు కాగా.. ప్రభుత్వం ముందుగా ప్రకటించిన విధంగా ఎకరాకు రూ.7,500 పెట్టుబడి సాయంగా ఇస్తే జిల్లా రైతులకు రూ.258.8 కోట్ల లబ్ధి చేకూరనుంది.

Similar News

News July 7, 2025

పోరండ్లలో నకిలీ వైద్యుడి క్లినిక్.. గుర్తించిన టీజీ ఎంసీ బృందాలు

image

తిమ్మాపూర్ మండలం పోరండ్లలో అర్హత లేకుండా డాక్టర్‌గా చలామణి అవుతూ అనుమతి, ఏ రకమైన బోర్డు లేకుండా నిర్వహిస్తున్న అల్లోపతి క్లినిక్‌ను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందాలు గుర్తించాయి. నకిలీ వైద్యుల క్లినిక్‌లపై తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో పోరండ్లలో రవీందర్ రెడ్డి అనే నకిలీ వైద్యుడు రోగులకు యాంటీబయాటిక్ ఇంజెక్షన్‌లు, స్టెరాయిడ్ ఇంజెక్షన్‌లు, పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్‌లు ఇస్తున్నట్లు గుర్తించారు.

News July 7, 2025

నేడు కరీంనగర్‌లో మంత్రుల పర్యటన

image

కరీంనగర్‌లో నేడు మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీహరి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనలు పర్యటించనున్నారు.
ఉ.9:30 గం.కు పాత ఆర్ట్స్ కళాశాల వద్ద నూతన పాఠశాల భవనాన్ని ప్రారంభిస్తారు.
10 గం.లకు అంబేడ్కర్ స్టేడియంలో వన మహోత్సవంలో పాల్గొంటారు.
11గం.కు చేప పిల్లల పెంపకం పరిశీలించి ముదిరాజ్ సంఘాలతో సమావేశమవుతారు.
11:30గంకు క్రీడా పాఠశాల, ఈతకొలను ప్రారంభించి వివిధ క్రీడా సంఘాలతో సమావేశమవుతారు.

News July 7, 2025

కరీంనగర్: మహిళలు వేధింపులకు గురవుతున్నారా..?

image

వేధింపులు ఎదురైతే ఏం చేయాలి? ఎవరి సహాయం కోరాలి? ఇలా అయోమయంలో పడే మహిళలకు భరోసాగా మారుతోంది కరీంనగర్ జిల్లాలోని షీ టీం. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ బృందం నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మహిళా చట్టాలు, రక్షణకోసం తీసుకుంటున్న చర్యలపై తెలియజేస్తోంది. వేధింపులు ఎదురైతే 8712670759 నంబర్‌కు ఫోన్ చేయాలని, ఆన్‌లైన్ మోసాలకు గురైతే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు.