News November 18, 2025
కరీంనగర్: రైతు వ(అ)రిగోస తీరేదెన్నడో..?

ఈ సీజన్లో అన్నదాతలు వడ్లతో అరిగోసపడుతున్నారు. మొంథా తుఫాన్ ఎఫెక్ట్‌తో ఉమ్మడి కరీంనగర్ రైతులు పొలాల్లో వరిని సకాలంలో కోయలేకపోయారు. తుఫాన్ శాంతించిన తర్వాత ఎలాగో కష్టపడి కోసినా వడ్లకు సరైన తేమశాతం రాక కొనుగోలు కేంద్రాల్లో కొనడంలేదు. దీంతో NOV మూడో వారం వచ్చినా ఇంకా కల్లాల్లోనే వడ్లు దర్శనమిస్తున్నాయి. వాటితోనే రైతన్న కాలం వెళ్లదీస్తున్నాడు. రబీ సీజన్ వచ్చినా ఇంకా ఖరీఫ్ వడ్ల తంటా మాత్రం తొలగడం లేదు.
Similar News
News November 18, 2025
పరకామణి కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు

AP: తిరుమల పరకామణి కేసులో నిందితుడు రవికుమార్‌తో పాటు సాక్షులకు భద్రత కల్పించాలని సీఐడీ డీజీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల విచారణకు హాజరైన టీటీడీ మాజీ ఏవీఎస్‌వో సతీశ్ అనుమానాస్పద స్థితిలో మరణించిన నేపథ్యంలో ఈ ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను డిసెంబర్ 2కు వాయిదా వేసింది. కాగా సతీశ్ మృతి కేసును తాజాగా హత్య కేసుగా నమోదుచేసిన విషయం తెలిసిందే.

వెంకటగిరిలో వైన్ షాపులు క్లోజ్

తిరుపతి జిల్లా వెంకటగిరిలోని 9 వైన్ షాపులు మూతపడ్డాయి. ‘20% మార్జిన్ ఇస్తామని చెప్పడంతో అప్లికేషన్లు వేశాం. తీరా 9% ఇచ్చారు. ఇలా అయితే లైసెన్స్ ఫీజు కట్టలేమని చెప్పడంతో 14% ఇచ్చారు. ఇప్పుడు పర్మిట్ రూములతో పాటు 20వతేదీ లోపు లైసెన్స్ ఫీజు చెల్లించాలంటున్నారు. ఇప్పటికే చాలా అప్పులపాలయ్యాం. ఇక మావల్ల కాదు’ అంటూ అన్ని షాపులు మూసేసి తాళాలు ఎక్సైజ్ ఆఫీసులో ఇవ్వడానికి ఓనర్లు ప్రయత్నించారు.