News September 6, 2025
కరీంనగర్: రైస్ మిల్లర్లు మారట్లే..!

ఉమ్మడి KNRలో రైస్ మిల్లర్ల ఇష్టారాజ్యం నడుస్తోంది. పెండింగ్ CMR క్లియర్ చేయాలని అధికారులు కోరుతున్నా మిల్లర్లు పట్టించుకోవట్లేదు. PDPLలో 140 రైస్ మిల్లులుండగా 25 మిల్లుల నుంచి 24వేల టన్నుల CMR పెండింగ్లో ఉంది. KNRలో 133 మిల్లులుండగా 22 డీఫాల్టయ్యాయి. వీట్నుంచి రూ.126 కోట్ల విలువచేసే ధాన్యం ప్రభుత్వానికి రావాలి. సివిల్ సప్లై, విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ దాడులు చేసినా మిల్లర్లు లైట్ తీసుకుంటున్నారు.
Similar News
News September 6, 2025
న్యాయశాస్త్రంలో తెనాలి విద్యార్థి రికార్డు

తెనాలికి చెందిన భాగవతుల నాగసాయి శ్రీరామ్ న్యాయశాస్త్రంలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి 9 బంగారు పతకాలను సాధించాడు. విశాఖలోని లా యూనివర్సిటీలో జరిగిన 11వ స్నాతకోత్సవంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దామోదరం సంజీవయ్య, నేషనల్ లా యూనివర్సిటీ ఛాన్సలర్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ చేతుల మీదుగా శ్రీరామ్ పతకాలు అందుకున్నారు.
News September 6, 2025
HYD: మళ్లీ వస్తా.. మిమ్మల్నే చూస్తుంటా!

ఖైరతాబాద్ మహా గణపతి గంగమ్మఒడికి చేరాడు. ఆయనరాకతో 11 రోజుల పాటు నగరమంతా కలకలలాడింది. ఉత్సవాల్లో భాగమైన నిమజ్జనం అనివార్యం కావడంతో గంగమ్మ చెంతకు చేరాడు. ‘ఎప్పటిలాగే మీకోసం మళ్లీ వస్తా.. అప్పటిదాకా మిమ్మల్నే చూస్తుంటా’ అన్నంట్లున్న ఆయన చూపు అందరి హృదయాలను బరువెక్కించింది. ఈ మహా క్రతువును చూసేందుకు వేలాదిగా ప్రజలు హుస్సేన్‌సాగర్‌కు తరలివచ్చారు.