News February 7, 2025

కరీంనగర్: రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని రైతు మృతి

image

కొత్తపల్లి శివారులో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన రైతు జంగిలి అంజయ్య(65) మృతి చెందారు. కొత్తపల్లి సంతకు వచ్చి సామగ్రిని కొనుగోలు చేసి తిరిగి సైకిల్‌పై వెలిచాల వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో అంజయ్య తీవ్రగాయాలతో మృతి చెందారు. అంజయ్య మృతదేహాన్ని KNR ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మార్చూరీలో భద్రపరిచామని పోలీసులు తెలిపారు.

Similar News

News November 9, 2025

లిల్లీ పూల సాగు – అనువైన రకాలు

image

లిల్లీ పూలను విడి పువ్వులుగా, కట్ ఫ్లవర్స్‌గా, దండలకు, బొకేల తయారీకి, సుగంద ద్రవ్యాల తయారీకి ఉపయోగిస్తారు. లిల్లీ పూలలో అనేక రకాలున్నాయి.
☛ సింగిల్ రకాలు : వీటిలో పూల రేకులు ఒక వరసలో అమరి ఉంటాయి.
☛ ఉదా: కలకత్తా సింగిల్, హైదరాబాద్ సింగిల్, మెక్సికన్ సింగిల్, ఫులే రజిని, ప్రజ్వల్, రజత్ రేఖ, శ్రింగార్, అర్కా నిరంతర. వీటిని విడి పువ్వులుగా, పూల దండల కోసం, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తికి వినియోగిస్తారు.

News November 9, 2025

NLG: చేతిలో పైసల్లేవ్.. కష్టంగా కుటుంబ పోషణ!

image

నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేస్తున్న తమకు వేతనాలు సకాలంలో అందడం లేదని కాంట్రాక్టు ఉద్యోగులు తెలిపారు. ఏజెన్సీల మధ్య ఉద్యోగులు నలిగిపోతున్నామన్నారు. 7 నెలలుగా జీతాలు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారన్నారు. ఆస్పత్రి అధికారులు కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు వత్తాసు పలుకుతున్నారన్నారు. జీతాలు రాకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని.. చేతిలో పైసల్లేకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందన్నారు.

News November 9, 2025

కాకినాడలో రేపు పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్

image

కాకినాడ జిల్లాలో ఈ నెల 10న యథావిధిగా పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ షాన్ మోహన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార నిమిత్తం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ కార్యక్రమం సోమవారం ఉదయం 10 గంటల నుంచి 1 వరకు కాకినాడ కలెక్టరేట్‌లో జరుగుతుందన్నారు. అధికారులు విధిగా ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని, అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన అన్నారు.