News April 2, 2025

కరీంనగర్: వేర్వేరు ఘటనల్లో నలుగురి మృతి

image

ఉమ్మడి KNR జిల్లా వ్యాప్తంగా నిన్న 4గురు మృతిచెందారు. సుల్తానాబాద్(M) పూసాలకు చెందిన N.లింగమూర్తి(39) పెళ్లి కావట్లేదని పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకోగా, గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన జయంతి(25)అనే యువతి కడుపునొప్పి భరించలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గంగాధర(M)కురిక్యాలకు చెందిన O.ప్రశాంత్(40) <<15959874>>కరెంటుషాక్‌తో<<>> చనిపోయాడు. JGTLరూరల్(M) నర్సింగాపూర్ కెనాల్‌లో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది.

Similar News

News April 3, 2025

ఇల్లందకుంట: యువ కౌలు రైతు ఆత్మహత్య

image

వ్యవసాయంలో వచ్చిన నష్టాన్ని భరించలేక యువ కౌలు రైతు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇల్లందకుంట మండలం సిరిసేడులో జరిగింది. స్థానికుల వివరాలు.. వంగ మధు(28) గ్రామంలో మూడెకరాల భూమిని కౌలుకు తీసుకుని మొక్కజొన్న పంటను వేయగా.. రూ.2లక్షల వరకు నష్టం వచ్చింది. దీంతో మనస్తాపంతో ఆదివారం పురుగుమందు తాగి, వరంగల్ MGMలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందాడు.

News April 3, 2025

నిర్మల్: KU.. గడువు మరోసారి పొడిగింపు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును మరోసారి పొడిగిస్తున్నట్లు KU అధికారులు పేర్కొన్నారు. నేటితో ఈ గడువు ముగియనుండగా ఏప్రిల్ 7 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించవచ్చని పేర్కొన్నారు. రూ.50 ఫైన్‌తో ఏప్రిల్ 9 వరకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

News April 3, 2025

బంగారం ధరలు మళ్లీ పెరిగాయ్!

image

బంగారం ధరలు ఇవాళ కూడా పెరగడంతో ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.500 పెరిగి రూ.85,600లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.540 పెరగడంతో రూ.93,380 వద్ద కొనసాగుతోంది. అటు వెండి ధర రూ.100 తగ్గడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,13,900గా ఉంది. గత తొమ్మిది రోజుల్లో గోల్డ్ రేటు రూ.4090 పెరగడం గమనార్హం.

error: Content is protected !!