News September 23, 2025
కరీంనగర్: వైద్య సిబ్బందికి హెపటైటిస్ బీ టీకా

కరీంనగర్ జిల్లా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌లో హెపటైటిస్ వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించే వైద్యులు, వైద్య సిబ్బంది, ఇతర కార్మికులకు హెపటైటిస్ బీ వాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆరోగ్య సంరక్షణలో పనిచేసే సిబ్బందికి రోగనిరోధక శక్తిని పెంచే ఉద్దేశంతో ఈ టీకా కార్యక్రమం మొదలుపెట్టినట్లు ఆయన తెలిపారు.
Similar News
News September 23, 2025
‘కరీంనగర్‌లో ఆయుర్వేద సేవలు అందిపుచ్చుకోవాలి’

కరీంనగర్‌లో ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా నేడు రామ్‌నగర్‌లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆయుర్వేద ఔషధాలు, యోగాసనాలను పరిశీలించి, ఉచిత సేవల వివరాలను రోగులకు తెలియజేయాలని ఆదేశించారు. గర్భిణీలకు యోగాసనాల అవగాహన, ఆస్పత్రి ఆవరణలో స్వచ్ఛత, మొక్కల నాటడం చేయాలన్నారు.
News September 23, 2025
కరీంనగర్: శ్రీ గాయత్రిదేవీ అవతారంలో అమ్మవారు

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని చైతన్యపురి మహాశక్తి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. నేడు 2వ రోజు శ్రీ మహాదుర్గ అమ్మవారు గాయత్రిదేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారిని పసుపు కొమ్ములతో అలంకరించారు. అమ్మవారి దేవాలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. అమ్మవారికి ధూపదీప, నైవేద్యాలు సమర్పించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.
News September 23, 2025
KNR: ప్రజావాణికి 318 దరఖాస్తులు

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రజావాణిలో భాగంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మి కిరణ్, మునిసిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. 318 అర్జీలు రాగా సత్వర పరిష్కారం కోసం వాటిని సంబంధిత శాఖల అధికారులకు బదిలీ చేశారు. పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.