News September 12, 2025

కరీంనగర్: శ్మశానవాటికలో కరవైన వసతులు.. ఆగ్రహించిన గ్రామస్థులు

image

శంకరపట్నం మండలం కన్నాపూర్ గ్రామంలో 3 నెలల చిన్నారి అనారోగ్యంతో మృతిచెందింది. చిన్నారి మృతి చెందడంతో దహన సంస్కారాలు చేయడానికి వెళ్తుంటే వర్షం మొదలై రాత్రి అయింది. శ్మశానవాటికలో విద్యుద్దీపాలు లేకపోవడంతో అంధకారం ఏర్పడింది. గ్రామస్థులు, అంత్యక్రియలకు వచ్చిన కుటుంబ సభ్యులు తమ సెల్ ఫోన్ టార్చ్ లైట్లతో దహన సంస్కారాలు నిర్వహించారు. కనీస వసతులు లేకపోవడంతో అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Similar News

News September 12, 2025

ములుగు: సాదా బైనామా దరఖాస్తులను పరిష్కరించాలి: కలెక్టర్

image

సాదా బైనామా దరఖాస్తులను పరిశీలించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర అధికారులను ఆదేశించారు. తహశీల్దార్, రెవెన్యూ అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన సాదా బైనామా దరఖాస్తులకు నోటీసులు ఇచ్చి సర్వే పూర్తి చేయాలని సూచించారు. నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీం, గ్రీవెన్స్ దరఖాస్తుల పరిశీలన, ధ్రువీకరణను వేగవంతం చేయాలన్నారు.

News September 12, 2025

జనగామ: భూ భారతి దరఖాస్తులను వేగవంతం చేయాలి: కలెక్టర్

image

భూ భారతి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన భూ భారతి, సాదా బైనామ, జాతీయ కుటుంబ లబ్ధి పథకం, సీఎం ప్రజావాణి దరఖాస్తులపై సమీక్షించారు. ఎమ్మార్వోల సందేహాలను నివృత్తి చేస్తూ, వేగవంతమైన పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు.

News September 12, 2025

HYD: కరెంట్ ఎప్పుడు విశ్రాంతి తీసుకోదు: MD

image

HYD వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో TGSPDCL ఎండీ ముషారఫ్ అలీ విస్తృతంగా పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. HYDలో కరెంట్ ఎప్పుడు విశ్రాంతి తీసుకోదని తెలియజేస్తూ.. POWER NEVER TAKES BREAK అని Xలో రాసుకోచ్చారు. వినియోగదారులందరికి అత్యుత్తమ నాణ్యమైన విద్యుత్ అందించడం కోసం యంత్రాంగం కృషి చేస్తున్నట్లు వివరించారు.