News August 12, 2025

కరీంనగర్: శ్రావణి సమాఖ్య పురస్కారాలు అందజేత

image

కరీంనగర్‌లో జరిగిన శ్రావణి సాహితీ, సాంస్కృతిక సమాఖ్య త్రిదశాబ్ది ఉత్సవాల సందర్భంగా ముగ్గురు ప్రముఖులకు పురస్కారాలు అందజేశారు. ప్రముఖ కవి, అవధాని గండ్ర లక్ష్మణరావు, ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల ప్రిన్సిపల్ కే. రామకృష్ణ, విశ్రాంత ఉపన్యాసకులు వంగపల్లి ప్రభాకర్ రావులకు ఈ పురస్కారాలు లభించాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వీరు చేస్తున్న సాహిత్య సేవలను గుర్తించి ఈ పురస్కారాలు అందించినట్లు నిర్వాహకులు తెలిపారు.

Similar News

News August 13, 2025

కరీంనగర్‌లో రేపు JOB MELA

image

జిల్లాలోని నిరుద్యోగులకు FLIPKARTలో ఉద్యోగాలు కల్పించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి తిరుపతిరావు తెలిపారు. రేపు ఉ. 11 గంటలకు జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. SSC, ఆపై విద్యార్హత కలిగినవారు, 18-45 ఏళ్లవారు అర్హులు. ఆసక్తిగల అభ్యర్థులు మరిన్ని వివరాలకు 9000266335, 7799661512, 9908230384, 7207659969లకు కాల్ చేయొచ్చు. నెల జీతం రూ.20,000- రూ.25,000 వరకు ఉంటుంది.

News August 13, 2025

KNR: భారీ వర్షాలు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

భారీ వర్షాల నేపథ్యంలో KNR కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఈ నెల 13 నుంచి 17 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురువనున్నాయని వాతావరణ శాఖ సూచనల మేరకు ముందు జాగ్రత్త చర్యగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. వర్షాల నేపథ్యంలో సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ 0878 2997247 కు కాల్ చేయాలని, ఈ సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.

News August 13, 2025

కరీంనగర్: ‘స్వచ్ఛ హరిత విద్యాలయ’ రేటింగ్‌లో పాల్గొనాలి

image

కరీంనగర్ జిల్లాలోని అన్ని పాఠశాలలు కేంద్ర విద్యా శాఖ నిర్వహిస్తున్న ‘స్వచ్ఛ హరిత విద్యాలయ రేటింగ్’లో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. స్వచ్ఛ హరిత విద్యాలయ నమోదు, బోధన, ఇంగ్లీష్ క్లబ్ వంటి అంశాలపై ఆమె మండల విద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. అన్ని పాఠశాలల్లో బుధవారం నుంచి ‘బుధవారం బోధన’ కార్యక్రమాన్ని అమలు చేయాలని కలెక్టర్ సూచించారు.